ETV Bharat / bharat

Horoscope Today (19-03-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - astrology in telugu

Horoscope Today (19-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈనాడు రాశి ఫలాలు
author img

By

Published : Mar 19, 2022, 4:38 AM IST

Horoscope Today (19-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

ఫాల్గుణ మాసం; బహుళ పక్షం

పాడ్యమి: మ.12.30 తదుపరి విదియ

హస్త: రా.12.47 తదుపరి చిత్త

వర్జ్యం: ఉ.9.16 నుంచి 10.52 వరకు

అమృత ఘడియలు: సా.6.49 నుంచి 8.24 వరకు

దుర్ముహూర్తం: ఉ.6.10 నుంచి 7.45 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం: ఉ.6.10, సూర్యాస్తమయం: సా.6.06

మేషం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదర్శనం ఉత్తమం.

వృషభం

మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తిపడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మిథునం

ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్దిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.

కర్కాటకం

మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్యహృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

సింహం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.

కన్య

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

తుల

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

వృశ్చికం

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

ధనస్సు

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.

మకరం

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

కుంభం

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

మీనం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శ్రమ ఫలిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (మార్చి 13 - మార్చి 19)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.