Horoscope Today(03-06-2022): ఈ రోజు గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కీలక వ్యవహారాలను మధ్యాహ్నంలోపు చేసుకోవడం ఉత్తమం. దుర్గామాత దర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

ముఖ్య విషయాలను మధ్యాహ్నం లోపు పూర్తిచేయండి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కీలక విషయాలలో అనుకున్నఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
మంచి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.

కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సిద్ధిస్తుంది. దగ్గరి వారి సలహాలను పెడచెవిన పెట్టొద్దు. నూతన వస్తు,వస్త్ర ప్రాప్తి కలదు. బలమైన ఆహారం, సమయానికి తగిన విశ్రాంతి అవసరం అవుతాయి. చిరునవ్వుతో అనేక సమస్యలు దూరమవుతాయని గుర్తించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం లోపే పూర్తి చేసుకోవడం ఉత్తమం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్త సంబంధీకులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉంటారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అనూహ్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు,మిత్రులను కలుపుకొని పోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. సూర్య ఆరాధన శుభప్రదం.