Horoscope Today (22-02-2022): ఈరోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్నివృథా చేయకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
వృషభం
చిత్తశుద్ధితో చేసే పనులు తృప్తినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహధ్యానం శుభకరం.
మిథునం
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. లింగాష్టకం చదవాలి.
సింహం
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.
కన్య
ఉత్సాహంగా పనిచేస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభం చేకూరుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
తుల
మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.
వృశ్చికం
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్దికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శనిశ్లోకం చదవాలి.
ధనస్సు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం.
మకరం
మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి, శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభం
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు,వినోదాలతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం మంచిది.
మీనం
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26)