ETV Bharat / bharat

కరోనా కట్టడిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది కేంద్ర హోమంత్రిత్వ శాఖ. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్​లో చర్చించారు హోంశాఖ కార్యదర్శి అజయ్​ కుమార్​ భల్లా.

author img

By

Published : Nov 26, 2020, 7:49 PM IST

Home Secretary asks states to ensure Covid19 protocol
'రాష్ట్రాలు కరోనా ప్రోటోకాల్​ను పటిష్టం చేయాలి'

దేశంలో కొవిడ్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో వైరస్​ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, కొవిడ్​-19 ప్రోటోకాల్​ అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్​ కుమార్​ భల్లా. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వీడియో కాన్ఫరెన్స్​లో సూచించారు.

హోంశాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేయాలన్న ఆయన... స్థానిక నిబంధనల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్దేశించారు. ఇప్పటికే గుజరాత్​, మధ్యప్రదేశ్​, పంజాబ్​ రాత్రివేళ కర్య్ఫూ అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య నిపుణులను సంప్రదించి, విస్తృతంగా చర్చించిన తర్వాత తీసుకురానున్న నూతన మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి 31 అమల్లోకి వస్తాయని తెలిపారు భల్లా.

ఆరు రాష్ట్రాల్లోనే 61శాతం కేసులు

దేశంలో అత్యధికంగా ఆరు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ డేటా స్పష్టం చేస్తోంది. కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లోనే 61శాతం కేసులు బయటపడతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'పునరుత్పాదక రంగానికి ప్రోత్సాహకాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.