ETV Bharat / bharat

వావ్​.. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్​ సెల్ఫీలు చూశారా?.. అంతా AI మహిమ గురూ!

author img

By

Published : Mar 25, 2023, 10:09 AM IST

Updated : Mar 25, 2023, 11:09 AM IST

సాంకేతికతకు క్రియేటివిటీ జోడించి మహాత్మా గాంధీ, సుభాశ్​ చంద్రబోస్​, మదర్​ థెరెసా, అబ్రహం లింకన్​ లాంటి ప్రముఖుల సెల్ఫీలు క్రియేట్ చేశారు ఓ కళాకారుడు. ప్రముఖలు సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.

Historical Selfie
Historical Selfie
వావ్​.. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్​ సెల్ఫీలు చూశారా?.. అంతా AI మహిమ గురూ!

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ).. ప్రస్తుత కాలంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సాంకేతికత వాడుకుని వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చూడుతున్నారు కొందరు. అయితే, ఇప్పుడు ఏఐ మరింత అభివృద్ధి చెందింది. మనిషి సామర్థ్యానికే సవాల్​ విసురుతున్న ఈ సాంకేతికతతో.. ఇటీవల చాట్​జీపీటీ అంటూ.. ఓ చాట్​బాట్​ సంచలనం సృష్టించింది. అదే సాంకేతికతకు క్రియోటివిటీ జోడించాడో కళాకారుడు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, చెగువేరా, మదర్ థెరెసా, అబ్రహాం లింకన్ లాంటి మహోన్నత వ్యక్తుల సెల్ఫీలు క్రియేట్ చేశారు. అదేలాగో తెలుసా!

సెల్​ఫోన్లు లేని రోజుల్లో ప్రముఖ వ్యక్తులు.. సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటారు? అనే ఆలోచన వచ్చింది కేరళకు చెందిన జో జాన్ ముల్లోర్ అనే కళాకారుడికి. అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఏఐ సాంకేతికతకు క్రియేటివిటీ జోడించారు. 'మిడ్​ జర్నీ' అనే సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి అలనాటి ప్రముఖులు.. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాశ్​ చంద్రబోస్, డాక్టర్​ బీఆర్ అంబేడ్కర్, మదర్​ థెరెసా, విప్లవ నేత కార్ల్ మార్క్స్​, ఎర్నెస్టో చెగువేరా, బాబ్​ మార్లే లాంటి తదితర వ్యక్తుల చిత్రాలు తయారు చేశారు. అలా చేసిన ఫొటోలకు రీపెయింట్​ వేయడానికి 'ఫొటో షాప్'​ సాఫ్ట్​వేర్​ సహాయం తీసుకున్నారు. హిస్టారికల్​ సెల్ఫీస్​ అని ఓ సిరీస్​ తీసుకొచ్చారు. వాటిని చూస్తే వారంతా నిజంగా సెల్ఫీలు తీసుకున్నారా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియా సైట్లలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Historical Selfie
డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​

జో జాన్.. ఆయన హార్డ్​ డ్రైవ్​లో తన స్నేహితులు పంపించిన పాత ఫొటోలను రీపెయింట్​ చేసి.. వాటిని తలదన్నేలా కొత్త ఫొటోలు క్రియేట్​ చేశారు. అలా ఈ హిస్టారికల్​ సెల్ఫీస్​ సిరీస్​కు శ్రీకారం చుట్టారు. ఈ ఫార్మాట్​లో ఒక ఫొటోను రూపొందించడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని జాన్​ చెప్పారు. ఇలాంటి ఫొటోలు క్రియేట్​ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అయినా క్రియేటివ్​గా ఫొటోలు తయారుచేయడమే తనకు ఆనందమని జాన్ పేర్కొన్నారు. జాన్​.. 17 ఏళ్లు దుబాయ్​లో ఉన్నారు. ఆ సమయంలో దుబాయ్​ మొత్తాన్ని పచ్చదనంతో నింపేస్తే ఎలా ఉంటుందనే ఫొటో క్రియేట్​ చేశారు. దాన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా ప్రసారం చేసింది. ఇవే కాకుండా సినిమా స్టార్ల ఫొటోలు, మెస్సీ చిన్నప్పటి ఫొటోలు కూడా క్రియేట్​ చేశారు. జాన్​కు భార్య డింబుల్, కుమార్తె జొనా ఉన్నారు.

Historical Selfie
నేతాజీ సుభాశ్​ చంద్రబోస్​

Last Updated : Mar 25, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.