కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ ఇలాంటి లాక్డౌన్ పరిస్థితులు కొత్తవేం కాదు. 121 ఏళ్ల క్రితమే భారతదేశంలో లాక్డౌన్ను విధించిన ఆధారాలు లభించాయి.
ప్రస్తుతం కొవిడ్.. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న విధంగానే 1900వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి ప్రపంచంతో పాటు భారతదేశాన్ని గడగడలాడించింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. వ్యాధిని కట్టడి చేసేందుకు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు విధించారు ఆనాటి గవర్నర్. జనం గుంపులుగా ఉండటం, దూరప్రాంత ప్రయాణాలను నిషేధించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే.. దానికి ప్రత్యేకంగా లాక్డౌన్ అనే పేరు పెట్టనప్పటికీ ప్రజలు ఈనాటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నారు.
కేరళలోని మలబార్ ప్రాంతంలో లాడ్డౌన్ విధించినట్లు రాతపూర్వక ఆధారాలను మళప్పురం జిల్లాలో కరిక్కడ్ పలిస్సేరి ప్రాంతానికి చెందిన ఉన్నికృష్ణన్ నంభూత్రి భద్రపరిచారు.
ఏకాదశి పర్వదినం సందర్భంగా మైసూర్, సాలెంతో సహా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాల నుంచి ప్రజలు మలయమ్ జిల్లాలో గురువాయూర్ ప్రాంతానికి రావడానికి నిషేధం విధిస్తున్నట్లు గవర్నర్ రాతప్రతిలో పేర్కొన్నారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా వస్తే తిరిగి వెనుకకు పంపుతామని హెచ్చరించారు. మలబార్ కలెక్టర్ జాక్సన్ తరుఫున ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆనాటి ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి వార్తా పత్రికల ఆధారాలు సైతం అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు!