ETV Bharat / bharat

హిజాబ్ వివాదం.. రెండు కాలేజీల విద్యార్థుల మధ్య ఘర్షణ - హిజాబ్​ వివాదం

Hijab Issue: కర్ణాటకలో హిజాబ్ అంశంపై రెండు కాలేజీల విద్యార్థులు ఘర్షణకు దిగారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థినులు తలకు గుడ్డ కట్టుకొని కొందరు విద్యార్థులు రావడం వల్ల అభ్యంతరం తెలుపగా వివాదం చెలరేగింది.

Hijab issue
హిజాబ్
author img

By

Published : Mar 4, 2022, 9:02 PM IST

Hijab Issue: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలోని పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పరస్పరం గొడవకు దిగారు. తలకు గుడ్డ కట్టుకుని వచ్చేేందుకు ప్రిన్సిపల్స్​ అనుమతించగా కొందరు అలానే పరీక్షలకు హాజరయ్యారు.

ఇప్పటికే హిజాబ్​ ధరించి పాఠశాలలకు హాజరు కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండగా.. వారు హిజాబ్​ ధరించినప్పుడు పెట్టుకునే పిన్​ను తలపై ఉంచుకొని హాజరయ్యారు. అది చూసిన ఓ వర్గం విద్యార్థులు.. వారిని బయటికి పంపాలని సిబ్బందిని కోరారు.

దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రం బయట నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం కళాశాల ప్రవేశద్వారం వద్ద విద్యార్థులు ఘర్షణకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కళాశాలల ప్రిన్సిపాల్​లు కూడా సమావేశం నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు తలకు గుడ్డ కట్టుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు. అయితే.. విద్యార్థులు హిజాబ్‌ను పోలి ఉండే గుడ్డపై పిన్‌లను ఉపయోగించవద్దని చెప్పారు.

ఇదీ వివాదం..

Hijab Controversy Karnataka: గతేడాది డిసెంబర్​ చివర్లో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు మహిళలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీనిపై నిరసన వ్యక్తమైంది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 9న సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశానుసారం ఫిబ్రవరి 14న పాఠశాలలను, 16న కళశాలలను తెరిచారు. కాగ, ఈ వ్యవహారంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

'ఉక్రెయిన్​లోని భారతీయుల తరలింపుపై కేంద్రం చర్యలు భేష్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.