న్యాయచరిత్రలోనే తొలిసారిగా ఓ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసింది కోర్టు. కర్ణాటక హైకోర్టు ఓ కేసు వాదనలను యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అత్యున్నత న్యాయస్థానాల్లో జరిగే కేసులకు సంబంధించి విచారణలు.. సామాన్య ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కేసు విచారణలను.. ప్రజలు వీక్షించేందుకు ఆన్లైన్ కోర్టు రూంలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇటీవలే.. సుప్రీం కోర్టు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ-కోర్టు సెషన్ల నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఉత్తర కన్నడ మత్స్యకారుల సంఘాలు దాఖలు చేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించిన కేసు విచారణ జరిపి ఇప్పుడు అమలు చేసింది హైకోర్టు ధర్మాసనం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రానున్న రోజుల్లో విచారణకు సంబంధించి.. మరిన్ని లైవ్ స్ట్రీమింగ్లు చూడొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: 'కోర్టునే మోసం చేయాలని చూస్తారా?'