ETV Bharat / bharat

'కర్తార్​పుర్'పై పాక్​ నిర్ణయాన్ని ఖండించిన భారత్​

కర్తార్​పుర్​ సాహిబ్​ గురుద్వారా నిర్వహణ బాధ్యతను సిక్కుయేతర సంస్థకు పాక్ ప్రభుత్వం బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది భారత్​. సిక్కుల మనోభావాలను దెబ్బతీసే ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఇలాంటి చర్యలు పాకిస్థాన్ నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నాయని మండిపడింది.

Kartarpur
కర్తార్​పుర్​ సాహిబ్​ గురుద్వారా
author img

By

Published : Nov 5, 2020, 3:17 PM IST

కర్తార్​పుర్​ సాహిబ్​ గురుద్వారా నిర్వహణ బాధ్యతను సిక్కుయేతర సంస్థకు బదిలీ చేస్తూ పాకిస్థాన్ తీసుకున్న​ ఏకపక్ష నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్​. ఈ చర్య ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సిక్కుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

కర్తార్​పుర్​ సాహిబ్​ వ్యవహారాలను నిర్వహించే హక్కును సిక్కు మైనారిటీలకు దూరం చేసే ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది భారత విదేశాంగ శాఖ.

" పాకిస్థాన్​ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా ఖండించదగినది. సిక్కుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది. సిక్కు మైనారిటీ హక్కులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్​ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మాకు వినతులు అందాయి. అలాంటి చర్యలు పాకిస్థాన్​ ప్రభుత్వ నిజ స్వరూపాన్నిసూచిస్తున్నాయి."

- అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.

గురుద్వారా సాహిబ్​ నిర్వహణను.. పాకిస్థాన్​ సిక్కు గురుద్వారా ప్రభంధక్​ కమిటీ (పీఎస్​జీపీసీ) నుంచి సిక్కుయేతర సంస్థ ఎవాక్యూ ట్రస్ట్​ ప్రాపర్టీ బోర్డు (ఈటీబీపీ)కి మార్చుతూ నిర్ణయం తీసుకుంది పాక్​ ప్రభుత్వం. ఈ మేరకు నవంబర్​ 3న పాకిస్థాన్​ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎకనామిక్​ కోఆర్డినేషన్​ కమిటీ అనుమతులు ఇచ్చింది.

చారిత్రక కర్తార్​పుర్​ నడవా తొలి వార్షికోత్సవం నవంబర్​ 9కి కొద్ది రోజుల ముందు పాకిస్థాన్​ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్ నడవాను మళ్లీ తెరిచిన పాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.