ETV Bharat / bharat

శాటిలైట్​ ఫోన్​ కాల్స్​ కలకలం- ఆ రాష్ట్రంలో హైఅలర్ట్​! - కర్ణాటకలో హైఅలర్ట్​

దేశంలో మరోమారు శాటిలైట్​ ఫోన్​ కాల్స్(satellite phone calls)​ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల నుంచి విదేశాలకు శాటిలైట్​ ఫోన్ల ద్వారా కాల్స్​ వెళ్లినట్లు నిఘా విభాగాలు గుర్తించాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు అధికారులు. స్లీపర్​ సెల్స్​ను(sleeper cells) ఆక్టివేట్​ చేసేందుకు ఉగ్రమూకలు(Terrorists) ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.

satellite phone calls
శాటిలైట్​ ఫోన్​ కాల్స్​ కలకలం
author img

By

Published : Oct 9, 2021, 12:29 PM IST

కర్ణాటకలోని తీర ప్రాంతం, మలెనాడు నుంచి విదేశాలకు శాటిలైట్​ ఫోన్​ కాల్స్(satellite phone calls)​ వెళ్లినట్లు గుర్తించిన క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్​ చేసింది నిఘా విభాగం. ఉత్తర కన్నడలోని దట్టమైన అటవీ ప్రాంతం, దక్షిణ కన్నడలోని ముడిపు ప్రాంతం సహా చిక్కమంగళూరు జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఈ ఫోన్​ కాల్స్​ను ట్రాక్​ చేసినట్లు అధికారులు తెలిపారు. గత వారం నుంచి ఐదు కాల్స్​ను గుర్తించినట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్​లో మైనారిటీలే(terrorist attacks in Kashmir) లక్ష్యంగా దాడులు జరుగుతున్న క్రమంలో ఉగ్రకదలికలపై అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక అధికారులకు సూచించాయి కేంద్ర నిఘా సంస్థలు. రాష్ట్రంలోని స్లీపర్​ సెల్స్​ను(sleeper cells) ఆక్టివేట్​ చేసేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నాయి నిఘా సంస్థలు. ఓవైపు రాష్ట్రంలో హైఅలర్ట్​ ప్రకటించిన క్రమంలోనూ ఫోన్​ కాల్స్​ వచ్చినట్లు తెలుస్తోంది. అవి ఎక్కడి నుంచి చేస్తున్నాయో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాలైన శివమొగ్గ, చిక్కమంగళూరు, ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం సేకరించాయి కేంద్ర బలగాలు. ఆయా ప్రాంతాల్లో శాటిలైట్​ ఫోన్లను(satellite phone calls) వినియోగించినట్లు తెలిపాయి.

476 కాల్స్​..

ఈ ఏడాదిలో కర్ణాటకలో శాటిలైట్​ ఫోన్లను(satellite phone calls) ట్రాక్​ చేయటం ఇది మూడోసారి. ఈ విషయంపై రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో.. కేంద్ర నిఘా సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. 2020 నుంచి ఇప్పటి వరకు విదేశాలకు శాటిలైట్​ ఫోన్​ ద్వారా 476 కాల్స్​ వెళ్లాయని చెప్పారు.

శాటిలైట్​ ఫోన్​లను(satellite phone calls) ఉగ్రమూకలు వినియోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న కారణంగా సాధారణ పౌరులు ఆ ఫోన్లను వాడటంపై 2008లో నిషేధం విధించారు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ షిప్పింగ్​.

ఇదీ చూడండి: 17 ఏళ్ల బాలికపై ప్రియుడు సహా ఏడుగురు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.