భారత్ బయోటెక్‌తో సాంకేతికత బదిలీ చేయించుకుని కరోనా టీకా ఉత్పత్తి చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో జట్టుకట్టినట్లు హెస్టర్ బయోసైన్సెస్ తెలిపింది. సాంకేతికత బదిలీ గురించి భారత్ బయోటెక్‌తో చర్చలు జరిగాయని వెల్లడించింది.
"టీకా ఉత్పత్తి చేయడానికి భారత్ బయోటెక్, గుజరాత్ ప్రభుత్వంతో కలిసి త్రికూటమిగా ఏర్పడ్డాం. హెస్టర్లో మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి భారత్ బయోటెక్‌తో చర్చలు జరుగుతున్నాయి. వీటి ఫలితాన్ని బట్టి తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి."
-రాజీవ్ గాంధీ, హెస్టర్ బయోసైన్సెస్ సీఈఓ, ఎండీ
పశువుల ఆరోగ్య సంరక్షణలో హెస్టర్ బయోసైన్సెస్ పేరెన్నికగలది. కోళ్లకు వాక్సిన్లను తయారీలో ఇది దేశంలోనే రెండో అతి పెద్ద సంస్థ.
ఇప్పటివరకు దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు- కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీలకు అనుమతులిచ్చారు. డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టీకా ఉత్పత్తి పెంచాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: 'భారత్, బ్రిటన్ స్ట్రెయిన్లపై కొవాగ్జిన్ సమర్థవంతం'