జమ్ముకశ్మీర్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో అక్కడ జరగాల్సిన రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయి.. జనజీవనం స్తంభించిపోయింది. సాయంత్రం వరకు మంచు కురిసే అవకాశం ఉందని.. మరుసటి రోజు(బుధవారం) పరిస్థితులు మెరుగుపడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షోపియాన్-రాజౌరీ జిల్లాలను కలిపే మొగల్ రహదారి సహా పలు మార్గాలను అధికారులు మూసివేయడం వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విమాన సేవలు కూడా నిలిపివేసినట్లు శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
కుంభవృష్టి
హిమపాతం మంచిదే అయినా... ప్రస్తుతం మంచు భారీగా కురవడం వల్ల పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ కార్యకలాపాలు సహా తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయలు అంతరాయం ఏర్పడటం వల్ల తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానికులు.
ఇదీ చూడండి: శివగామిలా పిల్లల్ని రక్షించాడు.. కానీ చివరకు...