అకాల వర్షాలు కేరళను (kerala rain today) ముంచెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆరు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' (Kerala rain alert) జారీ చేసింది వాతావరణ శాఖ.
![Heavy rains lash Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13621476_vlcsnap-2021-11-13-13h00m59s035-2.jpg)
తిరువనంతపురంలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. నాగర్కోవిళ్ మార్గంలోని రైల్వే ట్రాక్‌పై బురద పేరుకుపోయింది. నెయ్యట్టికరా ప్రాంతంలో జాతీయ రహదారి ఉన్న వంతెన పాక్షికంగా దెబ్బతింది.
![Heavy rains lash Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13621476_vlcsnap-2021-11-13-13h00m59s035-1.jpg)
విజింజం ప్రాంతంలో వర్షపు నీరు దుకాణాలను (Kerala rain news today) ముంచెత్తింది. విథురా, పొన్ముడి, నెడుమన్గడు, పాలోడ్ వంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాలువలు, నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో అరువిక్కరా, పెప్పర డ్యామ్‌కు వరద ప్రవాహం పెరిగింది. ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
![Heavy rains lash Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13621476_vlcsnap-2021-11-13-13h00m59s035-4.jpg)
నవంబర్ 16 వరకు...
మరోవైపు, తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా (Kerala rain forecast) వేసింది. ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్గోడ్ జిల్లాలకు సైతం వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 16 వరకు రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.
![Heavy rains lash Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13621476_vlcsnap-2021-11-13-13h00m59s035-3.jpg)
సహాయక శిబిరాల ఏర్పాటు
రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో కొండ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: Tractor rally: అరెస్టయిన ఆ 83 మంది రైతులకు రూ.2 లక్షల పరిహారం