భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌కు మృతదేహాలు కొట్టుకు వచ్చిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లాలో వెలుగుచూసింది. గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కన్వ జలాశయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
కన్వ నది ఒడ్డునే స్థానికులు మృతదేహాలను పూడ్చేవారు. అయితే ఇటీవల భారీ వర్షాలకు నది ఉద్ధృతి పెరగడం వల్ల ఆ శవాలన్నీ నదిలో కొట్టుకుపోయాయి. హున్సనాహల్లి-కొండాపుర్ ప్రాంతాల మధ్య ఎక్కువగా ఈ శవాలు కొట్టుకుపోవడాన్ని గుర్తించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుందని స్థానికులు చెప్పారు.
ఇదీ చూడండి : పెళ్లికాని ప్రసాదుల్లా 40వేల మంది- 'వధువు' కోసం ఆ రాష్ట్రాల్లో వేట