ETV Bharat / bharat

కొవిడ్​ చికిత్సలో ఆ ఔషధాల వినియోగం బంద్​! - Indian Council of Medical Research (ICMR)

కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో నూతన మార్గదర్శకాలను డైరెక్టర్​ జనరల్​ హెల్త్ సర్వీస్​(డీజీహెచ్​ఎస్​) జారీ చేసింది. ఐవర్​మెక్టిన్​, హైడ్రాక్సీక్లోరోక్విన్​, బుడెసోనైడ్​​ ఔషధాలను కొవిడ్​ రోగులకు ఇవ్వకూడదని పేర్కొంది.

dghs new guidelines for covid treatment
కొవిడ్​ చికిత్స
author img

By

Published : Jun 7, 2021, 4:41 PM IST

Updated : Jun 7, 2021, 5:52 PM IST

కొవిడ్ బాధితులకు చికిత్స విషయంలో కొత్త మార్గదర్శకాలను డైరెక్టర్​ జనరల్​ హెల్త్ సర్వీస్​(డీజీహెచ్​ఎస్​) జారీ చేసింది. ఐవర్​మెక్టిన్​, హైడ్రాక్సిక్లోరోక్విన్​, బుడెసోనైడ్​​ ఔషధాలను కరోనా చికిత్సలో వినియోగించకూడదని పేర్కొంది.

అయితే.. ఐవర్​మెక్టిన్, హెచ్​సీక్యూ వంటి ఔషధాలను కొవిడ్​ నివారణ కోసం వినియోగించేందుకు భారత వైద్య పరిశోధన మండలి గతంలో ఆమోదించటం గమనార్హం.

సీటీ స్కాన్​ వద్దు..

కొవిడ్​ ఇన్​ఫెక్షన్​ను గుర్తించడానికి హై రిజల్యూషన్​ సీటీ స్కాన్​ను కూడా చేయవద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది డీజీహెచ్​ఎస్​.

డీజీహెచ్​ఎస్ తాజా​ మార్గదర్శకాల్లో ఎస్​పీఓ2 స్థాయులు 92 నుంచి 95 శాతం మధ్య ఉన్నవారికి మాత్రమే ఆక్సిజన్​ మద్దతును అందించాలని సూచించింది. కరోనా చికిత్సలో వినియోగించే 'రెమ్​డెస్​విర్​' ఔషధాన్ని​ వైరస్​ బారిన పడ్డ 10 రోజుల తర్వాత వ్యాధితో తీవ్రంగా ప్రభావితమైన వారికి మాత్రమే అత్యవసర వినియోగం కింద అందిచాలని స్పష్టం చేసింది.

శాస్త్రీయ ఆధారాల లభ్యతపై ఔషధాల వినియోగం ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్​కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్​ సునీలా​ గార్గ్​ తెలిపారు.

ఇదీ చూడండి: గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటే ఆరోగ్యానికి చేటే!

Last Updated : Jun 7, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.