బంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయనను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అంతకుముందే బుద్ధదేవ్, ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. అప్పుడే ఆయన భార్య మీరా భట్టాఛర్జీ.. ఆస్పత్రిలో చేరగా.. బుద్ధదేవ్ ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆక్సిజన్ స్థాయిలు 90కంటే తక్కువకు పడిపోవడం వల్ల ఆసుపత్రిలో చేరారు.
ఈయనకు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉంది. మే18న ఈ 77ఏళ్ల కమ్యూనిస్టు దిగ్గజానికి కరోనా సోకింది. అయితే ఆసుపత్రిలో చేరడానికి నిరాకరించారు. సోమవారం.. కరోనా నుంచి కోలుకున్న ఆయన భార్య ఇంటికి వెళ్లారు.
ఇదీ చదవండి: బంగాల్లో హింసపై దీదీ సర్కార్, కేంద్రానికి నోటీసులు