ETV Bharat / bharat

కేసు కోసం కౌన్సిలింగ్​కు హైకోర్టు న్యాయమూర్తి! - మద్రాస్​ హైకోర్టు తాజా

స్వలింగ వివాహాలపై పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు ఓ సైకాలజిస్టు వద్దకు కౌన్సిలింగ్​కు వెళ్లాలని మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు. అప్పుడే తాను స్వలింగ వివాహాలపై దాఖలైన ఓ కేసులో మనసుతో ఆలోచించి తీర్పు వెలువరించగలనని పేర్కొన్నారు.

madras high court
సైకాలజిస్టు వద్దకు వెళ్లనున్న మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి
author img

By

Published : Apr 30, 2021, 7:40 PM IST

స్వలింగ వివాహాలపై పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి ఓ మానసిక వైద్య నిపుణుడి(సైకాలజిస్టు) వద్దకు కౌన్సిలింగ్​కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే.. ఈ అంశంపై దాఖలైన ఓ కేసులో తాను మనసుతో ఆలోచించి తీర్పు రాయగలనని తెలిపారు. స్వలింగ వివాహాల విషయంలో మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ ఓ మహిళా జంట దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన జస్టిస్​ ఎన్​ ఆనంద్​ వెంకటేశ్​ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

"ఈ కేసులో కచ్చితంగా నా మాటలు తలలోంచి కాకుండా మనసులో నుంచి రావాలి. స్వలింగ సంబంధాలపై పూర్తి అవగాహన లేకుంటే అలా రావటం అసాధ్యం. అందుకోసం.. నేను విద్యా దినకరన్(​ సైకాలజిస్టు)​ కౌన్సెలింగ్​ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం అపాయింట్​మెంట్​ ఇవ్వాల్సిందిగా దినకరన్​ను కోరుతున్నాను.

- జస్టిస్​ ఎన్​ ఆనంద్​ వెంకటేశ్, మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి.

మరోవైపు.. ఈ కేసును జూన్​ 7కు న్యాయస్థానం వాయిదా వేసింది. వివాహం చేసుకోవాలనుకుంటున్న తమకు తల్లిదండ్రుల నుంచి ప్రమాదం ఉందంటూ ఇద్దరు మహిళలు.. ఈ పిటిషన్​ దాఖలు చేశారు. అంతకుముందు ఈ కేసులో వారి తల్లిదండ్రులను కౌన్సిలింగ్​కు పంపించాలని న్యాయమూర్తి గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి: 'ప్రజలకు అందుబాటులో ఉండండి.. అండగా నిలవండి'

ఇదీ చూడండి: 'కేంద్రం, రాష్ట్రాల వ్యాక్సిన్ ధరల్లో తేడాలెందుకు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.