ETV Bharat / bharat

CBSE: ఫీజు రీఫండ్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

సీబీఎస్​ఈ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. విద్యార్థుల ఫీజు రీఫండ్​పై ఓ నిర్ణయం తీసుకోవాలని సీబీఎస్​ఈ బోర్డును ఆదేశించింది దిల్లీ హైకోర్టు(Delhi High Court). 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది.

HC, delhi HC
దిల్లీ హైకోర్టు, సీబీఎస్​ఈ బోర్డు
author img

By

Published : Jul 14, 2021, 4:51 PM IST

Updated : Jul 14, 2021, 5:16 PM IST

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దయిన క్రమంలో.. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాల్సిన అంశంపై సీబీఎస్​ఈ బోర్డు తుది నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టు(Delhi High Court) ఆదేశించింది. ఈ మేరకు 8 వారాల గడువు ఇస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

పదో తరగతి పరీక్షల కోసం రూ. 2100 రుసుం చెల్లించిన ఓ విద్యార్థి తల్లి వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. సీబీఎస్​ఈ తీసుకునే నిర్ణయంతో పిటిషనర్ సంతృప్తి చెందకపోతే.. ఆ నిర్ణయాన్ని సవాల్​ చేయొచ్చని జస్టిస్​ ప్రతీక్ జలన్​ అన్నారు. ఇరువర్గాల వారి నిర్ణయం సహేతుకంగా ఉండాలని ఆదేశించారు.

తొలుత పిటిషనర్​ తరఫున వాదించిన న్యాయవాది రాబిన్ రాజు.. పరీక్ష నిర్వహణ పూర్తిగా రద్దయిన నేపథ్యంలో కొంతమేరకైనా ఫీజును రీఫండ్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణ కోసం సీబీఎస్​ఈ బోర్డు చేసే ఖర్చు చాలా మేరకు తగ్గిందని, పాఠశాలలే గ్రేడింగ్​ ఇవ్వనున్నాయని తెలిపారు. ఈ వాదనలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఎస్ఈ బోర్డు ఏమీ చేయడం లేదని అనడం సరికాదని పేర్కొంది.

కొవిడ్​ ఉద్ధృతి కారణంగా సీబీఎస్​ఈ పరీక్షలు రద్దు చేస్తూ ఈటీవలే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:Delhi HC: ఉమ్మడి పౌరస్మృతి ఆశగానే మిగిలిపోవద్దు

Last Updated : Jul 14, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.