హరియాణాలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ఇన్స్పెక్టర్ దిల్లీలో హత్యకు గురయ్యాడు. సఫ్దార్‌జంగ్ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఈ నేరం చేయడం కలకలం సృష్టించింది.
హరియాణాలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వీరేంద్ర దిల్లీలోని తన సోదరుడి వద్దకు వచ్చాడని.. అతని తలపై బుల్లెట్ గాయాలున్నాయని డీసీపీ గౌరవ్ శర్మ తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయనున్నట్లు వివరించారు.
నిందితుడైన కానిస్టేబుల్ విక్రమ్ దిల్లీ పోలీసు విభాగంలో, గ్రేటర్ కైలాశ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడని.. వీరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి: