దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 21ఏళ్ల నికితా తోమర్ హత్య కేసు దోషులకు హరియాణాలోని ఫరీదాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో కుట్ర, కిడ్నాప్, హత్య నేరాలపై తౌసెఫ్, అతని స్నేహితుడు రెహాన్‌ను కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. వీరికి ఆయుధాలు సరఫరా చేసిన మరో నిందితుడు మహ్మద్ అజ్రుద్దీన్ను నిర్దోషిగా ప్రకటించింది.
2020 అక్టోబర్ 26న నిఖితా తోమర్ అనే యువతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న సమయంలో వచ్చిన తౌసిఫ్ ఆమెను కాల్చి చంపాడు. మొదటగా నిందితుడు ఆమెను కారు ఎక్కించడానికి ప్రయత్నించాడు. నిఖిత ప్రతిఘటించిన కారణంగా తుపాకీతో కాల్చాడు. ఈ సంఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన.. హరియాణా ప్రభుత్వం 'లవ్ జిహాద్' చట్టం చేయాలని నిర్ణయం తీసుకునేలా చేసింది.
డిజిటల్, ఫోరెన్సిక్ సాక్ష్యాల ఆధారంగా చార్జిషీట్‌ను తయారు చేసిన పోలీసులు.. 11 రోజుల్లోనే 700 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించడం విశేషం.
ఈ కేసు విచారణను ఫరీదాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో డిసెంబర్ 1న ప్రారంభించారు.
ఇదీ చదవండి: మత్తుమందు ఇచ్చి బాలికపై తాంత్రికుడు అత్యాచారం