మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరిట అహ్మదాబాద్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం పేరు మార్పును కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం పటేల్‌ను అవమానించడమేనని కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ విమర్శించారు.
అహ్మదాబాద్‌లోని క్రికెట్ స్టేడియం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరిట ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. దీని పేరు మార్చడం వల్లభ్ భాయ్ పటేల్‌ను అవమానించినట్టు కాదా? పటేల్ పేరిట ఓట్లు అడిగిన భాజపా.. ఇప్పుడు ఆయన్ను అవమానిస్తోంది. గుజరాత్ ప్రజలు ఈ అవమానాన్ని సహించలేరు.
-హార్దిక్ పటేల్, గుజరాత్ కాంగ్రెస్ నేత
గుజరాత్ అహ్మదాబాద్‌లోని మొతేరాలో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితీశ్ పటేల్ హాజరయ్యారు.
మొదటి మ్యాచ్‌గా ఇవాళ్టి నుంచి ఈ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్ టెస్ట్ జరుగుతోంది.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ పతనంతో ప్రజాస్వామ్యానికి ముప్పు'