ETV Bharat / bharat

ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు షాక్.. 14 రోజులు జైలులోనే! - ఉద్ధవ్ ఠాక్రే

Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్​ కౌర్ దంపతులకు 14 రోజుల జుడీషియల్ కస్టడి విధించింది బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా చదువుతాననే కౌర్ ప్రకటనతో శనివారం దుమారం రేగిన నేపథ్యంలో వారిని పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు.

MP Navneet Rana
Hanuman Chalisa row
author img

By

Published : Apr 24, 2022, 2:05 PM IST

Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా వివాదంలో మహారాష్ట్ర అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్​ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవికి షాక్ తగిలింది. శనివారమే అరెస్ట్ అయిన ఈ దంపతులకు ఆదివారం 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్.

ఇదీ జరిగింది: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన ఇంటిముందు తన భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్​ చాలీసా చదువుతానని నవనీత్ గురువారం ప్రకటించారు. దీంతో ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్దకు శివసేన సైనికులు శనివారం ఉదయం భారీగా చేరుకున్నారు. 9 గంటలు దాటినా నవనీత్​ కౌర్​ రాలేదని.. ఆమె ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయికి రానున్న నేపథ్యంలో తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు రాణా దంపతులు ప్రకటించారు. ప్రధాని భద్రతకు విఘాతం కలిగించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమపైకి సీఎం ఠాక్రేనే శివసేన కార్యకర్తలను పంపించారని నవనీత్ కౌర్ ఆరోపించారు. అయితే, ఎంతకీ ఆందోళనలు తగ్గకపోవడం వల్ల.. పోలీసులు నవనీత్​ను ఆమె నివాసం నుంచి బయటకు తరలించారు. మతపరమైన కారణాలతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవనీత్​ కౌర్​, ఆమె భర్త రవి రాణాను అరెస్టు చేశారు. ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం రెండు వారాలు జుడీషియల్ కస్టడీ విధించింది.

ఇవీ చూడండి:

హనుమాన్​ చాలీసా వివాదం.. ఎవరీ రాణా జంట..?

హనుమాన్ చాలీసా సవాల్​.. ఎంపీ నవనీత్ కౌర్​ దంపతుల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.