ETV Bharat / bharat

పొదల్లో నగ్నంగా బాలిక మృతదేహం.. పిల్లలతో నదిలో దూకి వివాహిత ఆత్మహత్య - నదిలో దూకి వివాహిత ఆత్మహత్య

9 ఏళ్ల బాలికను హత్య చేసి నగ్నంగా పొదల్లో పడేశారు దుండగులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్​గఢ్​ ముంగేలీలో జరిగింది. ​మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలో ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

married woman jumps in river
married woman jumps in river
author img

By

Published : Oct 15, 2022, 5:40 PM IST

ఛత్తీస్​గఢ్​ ముంగేలిలో దారుణం జరిగింది. 9 ఏళ్ల బాలికను హత్య చేసి నగ్నంగా పొదల్లో పడేశారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

గురువారం సాయంత్రం పశువులను మేపి ఇంటికి వెళ్తున్న కాపరులకు.. పొదల్లో ప్లాస్టిక్ సంచి కనిపించింది. దానిని తెరిచి చూడగా బాలిక మృతదేహం నగ్నంగా ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్థులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఖాజీ:
తన భర్తతో ఉన్న గొడవను సద్దుమణిగించాలంటూ వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు ఖాజీ సైయ్యద్​ మహ్మద్​ కోయా. ఈ ఘటన కేరళ కొజికోడ్​లో జరిగింది. 33 మహిళ తన భర్తతో ఉన్న గొడవను సద్దుమణిగించాలంటూ ఖాజీ వద్దకు వచ్చింది. ఈ క్రమంలోనే మహిళను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఖాజీ.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

పిల్లలతో సహా నదిలో దూకి వివాహిత ఆత్మహత్య:
మహారాష్ట్ర బండారాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం జరగగా.. శనివారం ఉదయం నదిలో తేలుతున్న మృతదేహాలను గ్రామస్థులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను తిడ్డి గ్రామానికి చెందిన దీపాలి శీతల్​(28), దేవాన్షి(3), వేదాన్షి(2)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

మహిళపై సామూహిక అత్యాచారం:
ఉత్తర్​ప్రదేశ్​ సహరన్​పుర్​లో దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు. నిందితుల్లో ముగ్గురు బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కుమారులు ముగ్గురు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరొకరు మైనింగ్ మాఫియా నాయకుడు హాజీ ఇక్బాల్​ ఉన్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. హాజీ ఇక్బాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

హత్యాచారం చేసి పొదల్లో వేసి:
ఉత్తర్​ప్రదేశ్​ మథురాలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి పొదల్లో పడేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన సతీశ్​గా గుర్తించారు.

ఇవీ చదవండి:తల్లీబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం.. దిల్లీలో బంధువుల ఆందోళన

'నా లవర్​తో మాట్లాడించండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా'.. కత్తితో యువకుడు హల్​చల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.