Gutta Sukhendar Reddy on Chandhra Babu Naidu Arrest : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం.. చంద్రబాబు నాయుడు అరెస్టును పార్టీలకు అతీతంగా నేతలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. టీడీపీ అధినేత అరెస్ట్‌పై తాజాగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సీనియర్ నేత చంద్రబాబును అరెస్టు చేయడం విచారకరమని అన్నారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ.. అవినీతి జరిగిందా లేదా కోర్టులు తేల్చాలని.. అప్పటి వరకు ఎవరూ నేరస్థులు కాదని తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
Gutta Sukhendar Reddy Fires On PM Modi : నిజామాబాద్ సభలో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ మాట్లాడిన భాష, బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వారి కేబినెట్లో ఎంత మంది అవినీతిపరులున్నారో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ కేసులున్న ఎంత మంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారో చూడాలన్నారు. ప్రధాని, సీఎంల మధ్య జరిగిన భేటీలో అంతర్గతంగా ఏమైనా మాట్లాడుకుంటే.. వాటిని బహిరంగ పరచడం పద్ధతి కాదని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.
Lokesh Comments: చంద్రబాబు ఏనాడు తప్పు చేయరు.. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉంటుంది: లోకేశ్
Gutta Sukhendar Reddy on Central Government : మహిళా రిజర్వేషన్లపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని.. కేవలం రాజకీయాల కోసమే చట్టం చేసినట్లు కనిపిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా మహిళల ప్రయోజనం కోసమే చేసినట్లయితే.. ఈ ఎన్నికల్లోనే అమలు చేయాల్సిందన్నారు. రాష్ట్రం సాగుకు విద్యుత్ సరఫరాపై ఎక్కడా సమస్య లేదని తెలిపారు. కుల గణనపై దేశవ్యాప్తంగా ఒకే విధానం కుదరదని.. రాష్ట్రాల వారీగా చేయడమే మంచిదని.. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
CBN Bail Petition చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా
ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరించడంపైనా ఆయన స్పందించారు. గవర్నర్ తమిళిసై.. తనను నామినేట్ చేసిన వారు చెప్పినట్లు వింటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు ఒక సీటు ఎక్కువో, తక్కువో రావచ్చు కానీ.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. అమల్లో ఉన్న పథకాలు, ప్రాజెక్టులు కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలం పుంజుకున్నది అనుకుంటున్నారు కానీ.. ఆ పార్టీ నేతల ఊహ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు గతంలో హైదరాబాద్, దిల్లీ హైకమాండ్లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు బెంగళూరు కూడా చేరిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని.. రాష్ట్రంలో ఏ పథకమైనా కేసీఆర్ చేయలేకపోతే ఇంకెవరూ చేయలేరని తెలిపారు.