ETV Bharat / bharat

'రిపబ్లిక్ డే రోజున సీఎంను హత్య చేస్తా'- ఖలిస్థానీ ఉగ్రవాది హెచ్చరిక

Gurpatwant Singh Pannun Threat : పంజాబ్ సీఎం భగవంత్ మాన్​పై దాడి చేసి, చంపుతామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేసే చోటే దాడి జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయమై తనను సంప్రదించాలని పంజాబ్ గ్యాంగ్​స్టర్లకు పిలుపునిచ్చాడు.

Gurpatwant Singh Pannun Threat
Gurpatwant Singh Pannun Threat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 1:43 PM IST

Gurpatwant Singh Pannun Threat : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ను హత్య చేస్తామని నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్​జే) సంస్థ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. రిపబ్లిక్ డే రోజునే సీఎంను చంపేస్తానని పేర్కొంటూ వీడియో విడుదల చేశాడు. ఆత్మాహుతి దాడిలో చనిపోయిన పంజాబ్ మాజీ సీఎం బేఅంత్ సింగ్​తో మాన్​ను పోల్చాడు పన్నూ. భగవంత్ మాన్ ఎక్కడి నుంచి త్రివర్ణ పతాకం ఎగిరేస్తే అక్కడ దాడి జరుపుతామని వ్యాఖ్యానించాడు. ఇందుకోసం పంజాబ్​లోని గ్యాంగ్​స్టర్లు తనను సంప్రదించాలని కోరాడు.

డీజీపీకి సైతం హెచ్చరిక
రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను తప్పుబట్టాడు పన్నూ. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్​కు సైతం హెచ్చరికలు పంపాడు. ఇటీవల అనేక మంది గ్యాంగ్​స్టర్లను పంజాబ్ పోలీసులు ఎన్​కౌంటర్​లో మట్టుబెట్టిన నేపథ్యంలో పన్నూ ఈ మేరకు హెచ్చరికలు చేశారు.

"పంజాబ్ పోలీసులు యువతకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతున్నారు. యువతను ఎన్​కౌంటర్ చేస్తున్నారు. వారిని గ్యాంగ్​స్టర్లుగా పేర్కొంటూ జైళ్లలో వేస్తున్నారు. నేటి బేఅంత్ సింగ్ అయిన భగవంత్ మాన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున పరిణామాలు మారిపోతాయి."
-గురుపత్వంత్ సింగ్ పన్నూ, సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత

సిక్స్ ఫర్ జస్టిస్​ను 2017లో స్థాపించారు. దాని వ్యవస్థాపక సభ్యుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లో నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల కింద (యూఏపీఏ) గురుపత్వంత్​ను భారత ప్రభుత్వం 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ ఇటీవల తరచుగా బెదిరింపులకు దిగుతున్నాడు గురుపత్వంత్ పన్నూ. వీటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కీలక ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది.

పార్లమెంట్​పై దాడి చేస్తానని గతేడాది డిసెంబర్ 6న హెచ్చరికలు చేశాడు పన్నూ. 2001లో పార్లమెంట్​పై దాడి జరిగిన డిసెంబర్ 13న లేదా అంతకుముందే ఈ దాడి జరుగుతుందంటూ హెచ్చరించాడు. దిల్లీని ఖలిస్థానీగా మారుస్తామంటూ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర నిఘా సంస్థలు, ఏజెన్సీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

NIA On Gurpatwant Singh : 'భారత్‌ను విభజించేందుకు ఉగ్ర కుట్రలు'.. NIA దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..

Gurpatwant Singh Pannun Property : కెనడా హిందువులకు గుర్​పత్వంత్​ వార్నింగ్​.. ఆస్తులు జప్తు చేసి కేంద్రం షాక్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.