ETV Bharat / bharat

నిన్న పద్మ పురస్కారం స్వీకరణ- నేడు ప్రభుత్వంపై నిరసన - రెజ్లర్ వీరేందర్​ సింగ్ తాజా వార్తలు

రాష్ట్రంలో తనలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న క్రీడాకారులను పారా అథ్లెట్లుగా గుర్తించాలని హరియాణా సీఎం మనోహర్​లాల్ ఖట్టర్​ను డిమాండ్​ చేశారు దివ్యాంగ రెజ్లర్, పద్మశ్రీ గ్రహీత వీరేందర్​ సింగ్. ఈ మేరకు దిల్లీలోని హరియాణా భవన్ బయట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

virender singh
వీరేందర్​ సింగ్
author img

By

Published : Nov 10, 2021, 8:25 PM IST

వీరేందర్​ సింగ్

దివ్యాంగ రెజ్లర్ వీరేందర్​ సింగ్..​ పద్మశ్రీ అవార్డు అందుకున్న 24 గంటల్లోనే హరియాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తనలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న ఎంతోమంది క్రీడాకారులను పారా అథ్లెట్లుగా గుర్తించాలని దిల్లీలోని హరియాణా భవన్ బయట కూర్చుని నిరసన తెలిపారు. పారా అథ్లెట్లకు వర్తించే అన్ని సదుపాయాలను వినికిడి సమస్య ఉన్న క్రీడాకారులకు వర్తింపజేయాలని.. అప్పటివరకు తాను ఇంటికి వెళ్లనన్నారు. ఈ మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్​ను డిమాండ్​ చేశారు.

virender singh
హరియాణా భవన్ బయట పతకాలను ప్రదర్శించిన వీరేందర్
virender singh
సోదరుడితో కలిసి నిరసనలో రెజ్లర్​ వీరేందర్

జజ్జర్ జిల్లా ససరౌళీ గ్రామానికి చెందిన వీరేందర్​ సింగ్​.. రెజ్లింగ్​లో అనేక పతకాలను సాధించారు. ఇప్పటికే ఆయనకు అర్జున అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా మంగళవారం పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు వీరేందర్​.

virender singh
అర్జున అవార్డుతో బయట కూర్చుని నిరసన తెలుపుతున్న వీరేందర్

రాష్ట్రంలోని వినికిడి సమస్య ఉన్న క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం హరియాణా మంత్రులను ఎన్నో ఏళ్లుగా వీరేందర్ కలుస్తున్నారని ఆయన సోదరుడు రాంబీర్ తెలిపారు. 2017లో వీరేందర్​కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6కోట్లు ప్రకటించిందని అయితే ఆ డబ్బు ఇంకా ఇవ్వలేదని, గ్రేడ్-ఏ ఉద్యోగం ప్రకటించినా.. అది ఇంకా రాలేదని తెలిపారు.

ఇదీ చూడండి: నా హత్య వార్తలు ఫేక్.. నేను బతికే ఉన్నా: రెజ్లర్ నిషా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.