పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన వేళ.. గుజరాత్‌కు చెందిన ఓ పెట్రోలు బంకు యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై.. వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోలు బంకులో.. నీరజ్ పేరుతో ఉన్న వారికి రూ.501 పెట్రోలు ఉచితంగా కొట్టించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. భరూచ్ జిల్లా నేత్రాంగ్-మోవి రోడ్డులోని ఎస్‌పీ పెట్రోల్ పంపు యజమాని అయూబ్ పఠాన్. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచాడు. అయితే నీరజ్ అని రుజువు చేసుకునేందుకు ఆధార్ జిరాక్స్‌ను ఆ పెట్రోలు బంకులో ఇవ్వాలని నిబంధన పెట్టాడు.
![Petrol Pump Offers Free Fuel To People Named Neeraj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-01-av-niraj-photo-gj10045_09082021153926_0908f_1628503766_915.jpg)
![Petrol Pump Offers Free Fuel To People Named Neeraj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-01-av-niraj-photo-gj10045_09082021153926_0908f_1628503766_874.jpg)
![Petrol Pump Offers Free Fuel To People Named Neeraj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-01-av-niraj-photo-gj10045_09082021153926_0908f_1628503766_175.jpg)
కటింగ్ ఫ్రీ
నేత్రాంగ్‌లోని పెట్రోల్ పంపు యజమాని ఉచిత పెట్రోల్‌ను ప్రకటించిన తర్వాత, అంకలేశ్వర్‌లోని సెలూన్ యజమాని కూడా నీరజ్ అనే పేరున్న వ్యక్తులకు ఉచిత హెయిర్‌కట్ చేస్తానని ఆఫర్ ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. "దేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి. అందులో క్రికెట్‌కే విపరీతంగా ఆదరణ లభిస్తుంది. అయితే నీరజ్ చోప్రా.. భారత్ తరఫున స్వర్ణం సాధించినందుకు గర్వంగా ఉంది. కాబట్టి ఈ క్రీడను ప్రోత్సాహంచేందుకు.. నీరజ్ అనే వ్యక్తులకు ఈ ఆఫర్ ప్రకటించాను" అని తెలిపాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా ఒక్కరోజులోనే హీరోగా మారిపోయాడు. జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 87.58 మీటర్లు విసిరారు నీరజ్. అథ్లెటిక్స్‌లో భారత్ వందేళ్ల పతక నిరీక్షణకు తెరదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నీరజ్ చోప్రా పేరు మార్మోగిపోయింది.
రెస్టారెంట్లో ఫుడ్ ఫ్రీ..
ఇక కర్ణాటకలోని షిరాలి జిల్లాలోని 'తమ్రా' రెస్టారెంట్ సైతం ఇదే తరహా ఆఫర్‌ను ప్రకటించి వార్తల్లో నిలిచింది. టోక్యో విశ్వక్రీడల్లో భారత్ తరఫున స్వర్ణపతాకాన్ని ముద్దాడిన నీరజ్ చోప్డాకు వినూత్నంగా అభినందనలు తెలిపింది. నీరజ్ అనే పేరు ఉన్న వ్యక్తులకు ఉచిత భోజనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు ఉంటుందని తెలిపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా విపరీత ప్రచారం చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటోంది. ఈ మేరకు 'తమ్రా' రెస్టారెంట్ యజమాని ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
![neeraj chopra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12726156_3.jpg)
![neeraj chopra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12726156_1.jpg)
నీరజ్ అనే పేరు గల వ్యక్తి తమ పేరును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను తగిన రుజువు చూపించాలి. ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు ఫోన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.
-ఆశిష్ నాయక్, తమ్రా రెస్టారెంట్
![neeraj chopra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bkl-01-free-unlimited-mills-at-hatkals-copper-restaurant-till-august-15-kac-10002_09082021145213_0908f_1628500933_201_1008newsroom_1628579119_613.jpg)
ఈ రెస్టారెంట్ సీ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందింది.
ఇవీ చూడండి: