ETV Bharat / bharat

'ఫాంటా' ఆమ్లెట్​.. ట్రై చేయండి ఒకసారి!

author img

By

Published : Aug 8, 2021, 10:40 AM IST

గుజరాత్​కు చెందిన ఓ స్ట్రీట్​ ఫుడ్​ స్టాల్​లో చేసిన​ ఓ వింత వంటకం వార్తల్లో నిలిచింది. ఆ డిష్​ పేరు 'ఫాంటా ఆమ్లెట్​'. స్థానికులు ఈ ఫాంటా ఆమ్లెట్​కు ఫ్యాన్స్​ అయిపోయారు. కానీ నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

fanta omelette
ఫాంటా ఆమ్లెట్​

ఈ మధ్యకాలంలో 'వింత' వంటకాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పాప్​కార్న్​ సలాడ్​, చాక్లెట్​ బిర్యాని, చిప్స్​ కర్రీ వంటి డిషెస్​ వైరల్​ అయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో 'ఫాంటా ఆమ్లెట్​' చేరింది.

ఫాంటాతో ఎలా?

గుజరాత్​ సూరత్​లో ఓ స్ట్రీట్​ ఫుడ్​ స్టాల్​లో ఈ ఫాంటా ఆమ్లెట్​ ఫేమస్​! దీనినే 'ఫాంటా ఫ్రై'గా పిలుస్తున్నారు. ఉడకపెట్టిన గుడ్లు, కారం, ఉడకపెట్టిన బంగాళదుంపలు, పుదీనా చట్నీ, ఫాంటాతో చేస్తారు ఈ ఫాంటా ఫ్రై. దీని ధర ప్లేటుకు రూ. 250. ఈ ఫాంటా ఆమ్లెట్​ మేకింగ్​ వీడియో ఓ ప్రముఖ ఫుడ్​ బ్లాగర్ తమ యూట్యూట్​ ఛానెల్​లో పోస్ట్​ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్​గా మారింది. ఈ వెరైటీ డిష్​ను ట్రై చేసిన ఆ ఫుడ్​ బ్లాగర్​.. 'రుచికరంగానే ఉంది' అంటూ సైగలు చేశారు.

అయితే నెటిజన్లు మాత్రం ఈ డిష్​ను స్వాగతించలేకపోయారు. 'అసలు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు?', 'ప్రపంచంలో ఎన్నో రకాల వంటలు ఉండగా.. నేను ఇదే ఎందుకు చూశాను?' అని ట్వీట్లు చేస్తున్నారు. ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఈ ఫాంటా ఆమ్లెట్​పై సెటైర్లు వేసింది.

  • first tandoori sushi, now fanta omelette. what else will this week make me see? 😭

    — Swiggy (@swiggy_in) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Three sunny side up+ 3 egg yolk gravy (with all sauces possible) + one boiled egg sauce/gravy made with Fanta = 250 bucks. More than Fanta it's the cost that baffled me. He has Thumbs up and limca omelette as well.
    God bless the person's digestive system. 🤷😐🙊🤐 https://t.co/zIRSSXybDC

    — madhuwanti saha (@freedomunleashd) August 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏదిఏమైనా.. ఫాంటా ఫ్రైకి మంచి డిమాండ్​ వస్తోందని, ధర రూ. 250 అయినా చాలా మంది కొని ఆరగిస్తున్నారని ఫుడ్​స్టాల్​ యజమాని చెబుతున్నారు. అంతేకాదు.. ఒకవేళ ఫాంటా ఇష్టం లేకపోతే తమ దగ్గర థంబ్సప్​ ఆమ్లెట్​, లిమ్​కా ఫ్రై కూడా ఉన్నాయంటున్నారు.

ఇవీ చూడండి:-

చాక్లెట్ బిర్యానీ.. ఇదేం టేస్ట్​రా బాబూ?!

'పాప్​కార్న్​ సలాడ్'.. ఇదేం ఐడియా తల్లీ!

Viral: 'ఆలూ చిప్స్​'తో కర్రీ- ఇదేం వెరైటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.