ETV Bharat / bharat

Gujarat Election Date : గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్ అప్పుడే! - గుజరాత్​ ఎన్నికల తేదీలు

Gujarat Election Date : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించింది ఎన్నికల సంఘం. పోలింగ్​, కౌంటింగ్​ తదితర తేదీలను వెల్లడించింది.

gujarat election date announced
gujarat election date announced
author img

By

Published : Nov 3, 2022, 12:33 PM IST

Updated : Nov 3, 2022, 12:51 PM IST

Gujarath Elections Date : గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. మొత్తం 182 నియోజకవర్గాలకు రెండు దశల్లో(డిసెంబర్ 1న, 5న) పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్​తో కలిపి డిసెంబర్​ 8న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితం వెలువడనుంది.

గుజరాత్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు..
మొదటి దశ : డిసెంబర్ 1

  • పోలింగ్ జరిగే స్థానాలు : 89
  • మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ : నవంబర్ 5
  • నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ : నవంబర్ 14
  • నామినేషన్ల పరిశీలన : నవంబర్ 15
  • నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు : నవంబర్ 17

రెండో దశ : డిసెంబర్ 5

  • పోలింగ్ జరిగే స్థానాలు : 93
  • రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ : నవంబర్ 10
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : నవంబర్ 17
  • నామినేషన్ల పరిశీలన : నవంబర్ 18
  • నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు : నవంబర్ 21
  • రెండు దశల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 8

గుజరాత్​లో భాజపా, ఆప్​, కాంగ్రెస్​ మధ్య త్రిముఖ పోరు ఉండబోతోంది. 2017లో 182 సీట్లకు గాను 99 సీట్లు గెలిచి భాజపా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది. 77 సీట్లతో కాంగ్రెస్​ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి కూడా గెలిచి.. వరుసగా ఆరోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా అవతరించేందుకు కమల దళం ఉవ్విళ్లూరుతోంది. అయితే భాజపాపై వచ్చిన వ్యతిరేకతను కూడగట్టి అధికారం చేజిక్కించుకునేలా కాంగ్రెస్​ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరో పక్క పంజాబ్​లో గెలిచి ఊపుమీదున్న ఆప్​.. ఈసారి గుజరాత్​లో పాగా వేయాలని భావిస్తోంది.

హిమాచల్​తో పాటే కౌంటింగ్..
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. వీటితో పాటే గుజరాత్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ భాజపా అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 68 స్థానాలకు ఎన్డీఏ 43 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆమ్​ఆద్మీ పార్టీ.. హిమాచల్​ ప్రదేశ్​లోనూ బరిలోకి దిగనుంది.

ఇవీ చదవండి : స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం'

భాజపా ఎమ్మెల్యేకు 'వలపు వల'.. వాట్సాప్​లో న్యూడ్ వీడియో​ కాల్​!

Last Updated : Nov 3, 2022, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.