ETV Bharat / bharat

గుజరాత్​లో భాజపాకు షాక్​- ఎంపీ రాజీనామా - ఎంపీ మన్సుక్ వాసవా పార్టీకి రాజీనామా

గుజరాత్​ భరూచ్ నియోజకవర్గ ఎంపీ మన్సుక్ వాసవా పార్టీకి రాజీనామా చేశారు. తన పొరపాట్ల వల్ల పార్టీకి ఇబ్బందులు కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

Bharuch MP resigns from BJP
పార్టీకి రాజీనామా చేసిన భాజపా ఎంపీ
author img

By

Published : Dec 29, 2020, 2:15 PM IST

కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్​ భాజపా ఎంపీ మన్సుక్ వాసవా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భరూచ్​ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్​కు ఈ మేరకు లేఖ రాశారు. తన పొరపాట్ల వల్ల పార్టీ ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు మన్సుక్.

నర్మద జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్​ జోన్​గా ప్రకటిస్తూ ఇటీవల పర్యావరణ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొద్దిరోజుల క్రితం ప్రధానికి లేఖ రాశారు మన్సుక్. పర్యావరణం పేరిట గిరిజనుల వ్యక్తిగత వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు మన్సుక్.

భరూచ్ నియోజకవర్గానికి 1998లో జరిగిన ఉపఎన్నికల్లో వాసవా తొలిసారి ఎంపీగా గెలిచారు. అనంతరం 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1994లో గుజరాత్​లో ఉపమంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.