ETV Bharat / bharat

ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి - gujarat car accident

ఓ ఎస్​యూవీ అతి వేగంగా దూసుకెళ్లి ఆటో, బైక్​ను ఢీకొట్టగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది.

gujarat accident news
ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం
author img

By

Published : Aug 12, 2022, 8:18 AM IST

అతి వేగం ఆరుగుర్ని బలిగొంది. గుజరాత్ ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం దగ్గర్లో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఆనంద్​, తారాపుర్​ను కలిపే రాష్ట్ర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్​యూవీ.. ఆటోను, బైక్​ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్​పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు.

gujarat accident news
తీవ్రంగా దెబ్బతిన్న కారు ముందు భాగం

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులంతా సోజిత్రా, బొరియావీ గ్రామాల ప్రజలని నిర్ధరించారు. గుజరాత్​లో ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్​ పదియార్​.. ఎస్​యూవీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని ప్రాథమికంగా తేల్చారు. కాసేపటికే కేతన్​ను అరెస్టు చేశారు. ఆరుగురు మరణానికి కారణమయ్యాడని ఐపీసీ సెక్షన్​ 304 కింద కేసు నమోదు చేశారు.

gujarat accident news
ప్రమాదానికి గురైన ఆటో
gujarat accident news
ప్రమాదానికి గురైన బైక్
gujarat accident news
దెబ్బతిన్న కారు ముందు భాగం
gujarat accident news
కారు లోపల ఎమ్మెల్యే బోర్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.