ETV Bharat / bharat

11 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారం.. ఆపై హత్య - సూరత్​లో బాలికపై దాడి, అత్యాచారం

Girl rape in Gujarat: 11 ఏళ్ల బాలిపై పైశాచికత్వాని చూపించాడు ఓ దుండగుడు. కిడ్నాప్​ చేసి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆమె జననాంగాలను ఛిద్రం చేసి చంపేశాడు. ఈ దారుణం గుజరాత్​లోని సూరత్​లో వెలుగుచూసింది.

11-yr-old girl kidnapped, raped
11 ఏళ్ల బాలికపై అత్యాచారం
author img

By

Published : Feb 21, 2022, 10:27 PM IST

Girl rape in Gujarat: గుజరాత్‌ సూరత్​లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడో దుండుగుడు. అంతటితో ఆగకుండా ఆమె మర్మాంగాలను ఛిద్రం చేసి చంపేశాడు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సూరత్​కు 15 కిమీ దూరంలో ఉన్న పల్సానా పట్టణానికి సమీపంలో జరిగినట్లు తెలిపారు.

అయితే.. బాలికపై అత్యాచారం చేసింది ఒక్కరేనా లేకా ఇంక ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

"మృతురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెను సమీపంలో ఉండే ఓ ఫ్లాట్​కు తీసుకుని వెళ్లాడు నిందితుడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు బాలిక కనిపించకుండా పోయిందని గమనించారు. వారు వెతకగా బయట నుంచి తాళం వేసి ఉన్న గదిలో చిన్నారి తీవ్రంగా గాయపడి ఉండడం చూశారు. అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం."

- పోలీసులు

ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని దయారామ్​గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా ఆ వ్యక్తిని కనిపెట్టినట్లు పేర్కొన్నారు. బాలికను గదిలో బంధించేందుకు తాళం కొనాలని నిందితుడు బయటకు వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్​ ఆధారంగా పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు.

కూలి పని చేసుకుంటూ ఉంటే..

రాజస్థాన్​లోని బరన్​ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కూలి పని చేసుకుంటున్న ఓ 26 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయగా.. వారిని సోమవారం అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను బరన్ జిల్లాలోని అంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అతుల కేవత్, చిత్తర్‌లాల్ మేఘ్వాల్, భైరులాల్ కేవత్​లు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు 'ఈవీఎం' ట్యాంపరింగ్​ భయం.. కార్యకర్తలతో కాపలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.