ETV Bharat / bharat

వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ ఉందా? అయితే నో టెస్టింగ్, నో క్వారంటైన్! - ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

International Passengers Quarantine: కొవిడ్​ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కేంద్రం సడలించింది. ప్రయాణికులు ఇకపై ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

International Passengers Quarantine
అంతర్జాతీయ ప్రయాణికులు
author img

By

Published : Feb 10, 2022, 3:47 PM IST

International Passengers Quarantine: అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను కేంద్రం సడలించింది. భారత్​కు వచ్చిన ప్రయాణికుల్లో నెగెటివ్​ వచ్చిన వారు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్థానంలో ప్రయాణికులు 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ చేసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈనెల 14న అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

అప్పుడు టెస్టింగ్​​ అవసరం లేదు..

ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్​టీపీసీఆర్​ రిపోర్ట్​తో పాటు వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ను కూడా అప్​లోడ్​ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఒకవేళ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకుంటే.. ఆ సర్టిఫికెట్​ పెడితే సరిపోతుందని, ఆర్​టీపీసీఆర్​ రిపోర్ట్​ అవసరం లేదని స్పష్టం చేసింది. 82 దేశాల ప్రయాణికులకు ఈ అవకాశం కల్పించింది. ఈ జాబితాలో అమెరికా, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా, హాంగ్​కాంగ్, సింగపూర్, ఇరాన్ దేశాలు ఉన్నాయి.

భారత్​కు వచ్చిన 8వ రోజు కొవిడ్​ టెస్ట్​ చేయించుకుని ఎయిర్​ సువిధా పోర్టల్​లో సమర్పించాలన్న నిబంధనను కూడా ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్​పోర్టు వద్ద స్క్రీనింగ్​లో ప్రయాణికులకు లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వారిని ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తామని కేంద్రం తెలిపింది.

భారీగా ఒమిక్రాన్​ కేసులు నమోదైన కారణంగా ఇదివరకు ముప్పు ప్రాంతాలుగా పలు దేశాలను గుర్తించింది. తాజాగా ఈ జాబితాలో నుంచి వివిధ దేశాలను తొలగించింది.

ఇదీ చూడండి : దేశంలో కరోనా తగ్గుముఖం.. 4.44 శాతానికి పాజిటివిటీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.