ETV Bharat / bharat

బిల్లుల అజెండాతో కేంద్రం- ధరల అస్త్రంతో విపక్షం

author img

By

Published : Jul 18, 2021, 2:56 PM IST

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలని మోదీ సర్కారు భావిస్తుండగా.. ధరల పెరుగుదల, కరోనా నియంత్రణ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.

parliament monsoon session
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం ప్రారంభం కానున్న ఈ సమావేశాలు.. వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత రెండు సమావేశాల్లో ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో భేటీ కాగా.. ఈసారి ఒకే సమయానికి రెండు సభలు కార్యకలాపాలు సాగించనున్నాయి. ఎప్పటిలానే ఈసారీ ఉదయం 11 గంటలకు సభలు మొదలు కానున్నాయి.

సమావేశాల నేపథ్యంలో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో అధికార పక్షం బరిలోకి దిగుతోంది. చట్టాలకు సంబంధించి భారీ అజెండా రూపొందించుకుంది. 17 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

విపక్షాలు సంసిద్ధం

మరోవైపు, ప్రధాన సమస్యలపై సర్కారును ఇరుకున పెట్టాలని విపక్ష పార్టీలు వ్యుహాలు రచించుకుంటున్నాయి. దేశంలో నిత్యావసర, ఇంధన ధరలు మిన్నంటడంపై విపక్ష సభ్యులు భగ్గుమనే అవకాశం ఉంది. వీటితో పాటు సాగు చట్టాల రద్దు, కరోనా నియంత్రణ, టీకా పంపిణీ, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, చైనాతో సరిహద్దు సంక్షోభం, దేశ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.

కరోనాను ఎదుర్కోవడం, ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సమ్మతించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిని ప్రస్తావించాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్న వేళ.. ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమవుతోంది.

చట్టాల అజెండా

కొత్తగా 17 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో అమలవుతున్న బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఇవి కాకుండా లోక్‌సభలో నాలుగు, రాజ్యసభలో మూడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులివే

  • ఇన్​సాల్వెన్సీ అండ్​ బ్యాంక్​రప్ట్సీ బిల్లు
  • స్పెషల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్ బిల్లు
  • జాతీయ ఆహార టెక్నాలజీ సంస్థ బిల్లు
  • దేశ రాజధాని ప్రాంత గాలి నాణ్యత యాజమాన్యంపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు
  • విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు
  • గిరిజన సంస్కరణల బిల్లు
  • డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లు
  • ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ బిల్లు
  • అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు
  • తల్లిదండ్రులు-వృద్ధుల సంక్షేమం బిల్లు
  • జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతి

ఆ బిల్లులు కూడా

మరోవైపు, వివాదాస్పద జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ప్రైవేట్ బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పలువురు భాజపా ఎంపీలు వీటిని సభలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఉభయ సభల సెక్రెటేరియట్​లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్​సభలో.. ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా సైతం నోటీసు ఇచ్చారు. వీటిపై సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రైవేటు బిల్లులు ఆమోదం పొందే అవకాశాలు తక్కువేనని సమాచారం.

కొత్త మంత్రులు

కేంద్ర కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ తర్వాత జరిగే తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవే కానున్నాయి. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేయనున్నారు.

వ్యాక్సినేషన్ పూర్తి

పార్లమెంట్ సభ్యుల్లో చాలా వరకు టీకా తీసుకున్నవారే ఉన్నారు. 444 మంది లోక్​సభ సభ్యులు, 218 మంది రాజ్యసభ సభ్యులు రెండు డోసులు స్వీకరించారు. ఆరోగ్య కారణాలతో పలువురు సభ్యులు టీకా తీసుకోలేదు.

కరోనా జాగ్రత్తలు

దాదాపుగా ఎంపీలందరూ టీకా తీసుకున్నప్పటికీ.. పార్లమెంట్​లో కరోనా నిబంధనలను యథావిధిగా అమలు చేయనున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలు తప్పనిసరిగా కొనసాగనున్నాయి.

ఇదీ చదవండి: అఖిల పక్ష సమావేశం- ప్రధాని హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.