ETV Bharat / bharat

ఆ చిన్నారులకు కేంద్రం 'డబుల్' సాయం! - పీఎం కేర్స్​

కొవిడ్​-19తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు మరింత సహాయం అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం చిన్నారులకు నెలవారీగా ఇస్తున్న రూ. 2 వేలు స్టయిఫండ్​ను రూ.4 వేలకు పెంచాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

children who lost parents due to COVID-19
కొవిడ్​తో అనాథలైన చిన్నారులు
author img

By

Published : Sep 14, 2021, 9:16 PM IST

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఇచ్చే నెలవారీ ఆర్థిక సాయాన్ని రెండింతలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం వారికి రూ. 2వేలు ఇస్తుండగా.. దానిని రూ. 4వేలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మరికొన్ని వారాల్లో ప్రతిపాదన ఆమోదం కోసం కేబినెట్​కు పంపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలకు స్టయిఫండ్​ను 2వేల నుంచి 4వేలకు పెంచాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది.

కొవిడ్​తో అనాథలుగా మారిన చిన్నారులకు 'పీఎం- కేర్స్ ఫర్ చిల్డ్రన్' కింద సహాయం చేస్తామని మే నెలలో కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 467 జిల్లాల్లో.. 3,250 మంది దరఖాస్తు చేసుకోగా.. 667 మందిని జిల్లా కలెక్టర్లు ఆమోదించారు.

ఇదీ చదవండి: Hindi Diwas: 'ప్రపంచ వేదికపై హిందీ భాషది చెరగని ముద్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.