ETV Bharat / bharat

మరో కోటి కొవిషీల్డ్​ డోసులకు ప్రభుత్వం ఆర్డర్​ - వ్యాక్సినేషన్​

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని కేంద్రం వేగవంతం చేస్తోంది. మరో కోటి డోసుల కోసం సీరం సంస్థకు ఆర్డర్​ పంపింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్​లో ఇప్పటివరకు 41 లక్షలమందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు టీకా పొందారు.

author img

By

Published : Feb 4, 2021, 5:41 AM IST

కొవిడ్​ వ్యాక్సినేషన్​లో భాగంగా.. మరో కోటి డోసులను అందించాలని సీరం సంస్థను అడిగింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ అధీనంలోని హెచ్​ఎల్​ఎల్​ లైఫ్​కేర్​ లిమిటెడ్​.. కేంద్ర వైద్య శాఖ తరఫున టీకాల కోసం ఆర్డర్​ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక్కో డోసు ధర రూ. 210(జీఎస్​టీతో కలిపి) అని పేర్కొన్నాయి.

ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా టీకాను భారత్​లో ఉత్పత్తి చేస్తోంది సీరం సంస్థ. ఇప్పటికే జనవరి 11న కేంద్రానికి 1.1 కోట్ల డోసులను అందించేలా ఒప్పందం కుదిరింది. ఈ ఆర్టర్​ విలువ రూ. 231 కోట్లు. ఇప్పుడు మరో కోటి డోసులతో కలిపి మొత్తం విలువ రూ. 441 కోట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు.

మరో 4.5 కోట్ల డోసులు..

మొదటి ఆర్డర్​(1.1కోట్లు) కాకుండా.. మరో 4.5 కోట్ల డోసులను సీరం సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది మోదీ సర్కార్​.

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం భారత్​లో జనవరి 16న ప్రారంభమైంది. కొవిషీల్డ్​తో పాటు, దేశీయంగా భారత్​ బయోటెక్​ తయారు చేసిన కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ల అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించింది. ఇప్పటివరకు దేశంలో 41 లక్షల మందికిపైగా టీకా పొందారు.

ఇదీ చూడండి: కొవిడ్​ టీకాపై సంకోచమే అసలు సమస్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.