ETV Bharat / bharat

కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల ఎగుమతికి కేంద్రం పచ్చజెండా - టీకా ఎగుమతి వార్తలు

Vaccine Export News: కరోనా టీకాలైన కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్​కు సరిపడా వ్యాక్సిన్​లు దేశంలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

commercial export of Covishield, Covaxin
కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల ఎగుమతికి కేంద్రం పచ్చజెండా
author img

By

Published : Nov 25, 2021, 10:12 PM IST

Vaccine Export News: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల వాణిజ్య ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో సరిపడా టీకా డోసులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా టీకా లభ్యత ఆధారంగా నెలనెలా ఎన్ని డోసులు ఎగుమతి చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది.

ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొవాక్స్‌లో భాగంగా నేపాల్, తజికిస్థాన్​, బంగ్లాదేశ్, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల డోసుల కొవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం అనుమతించింది. నేపాల్‌, తజికిస్థాన్‌లకు ఈ వారంలో కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయి.

ఇప్పటివరకు దేశంలో 22.72 కోట్ల డోసులు అందుబాటులో ఉండగా టీకా ఉత్పత్తి పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు నాటికి సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ల నుంచి దాదాపు 31 కోట్ల కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ డోసులు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో 2 కోట్ల జైకోవ్‌-డీ డోసులను అందిచేందుకు జైడస్‌ క్యాడిలా సరఫరా చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 11మంది ఉన్నతాధికారులకు కరోనా​.. ఒకరు పరార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.