ETV Bharat / bharat

విదేశీ టీకాలకు సత్వర అనుమతులు: కేంద్రం - వ్యాక్సినేషన్

దేశంలో కరోనా టీకాల నిల్వలు తగ్గిపోతున్న వేళ కేంద్రం కీలక ముందగుడు వేసింది. ఇతర దేశాల్లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన విదేశీ తయారీ టీకాలను భారత్​లోనూ అనుమతించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలపింది.

Govt fast-tracks approval for foreign-produced COVID-19 vaccines cleared in other countries
అతిత్వరలో విదేశీ టీకాలకు అనుమతులు: కేంద్రం
author img

By

Published : Apr 13, 2021, 3:19 PM IST

విదేశీ తయారీ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. దేశంలో టీకాల లభ్యతను పెంచడం, వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

భారత్​లో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించే ముందు తొలుత 100 మంది లబ్ధిదారులకు అందించి, వారం రోజుల పాటు సమీక్షించనున్నారు. అమెరికా, ఐరోపా, యూకే, జపాన్​ సహా ఇతర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాలకు మన దేశంలోనూ ఆమోదముద్ర వేయాలన్న నిపుణుల కమిటీ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం దేశంలో భారత్​ బయోటెక్ తయారీ కొవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ వినియోగిస్తున్నారు. కాగా ఇటీవలే రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్​-వి అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది.​

ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో 10 మంది రోగులు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.