ETV Bharat / bharat

విదేశాల్లో కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తి! - టీకా

దేశం అవసరాల మేరకు టీకా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కొవాగ్జిన్​ ఉత్పత్తిని విదేశాల్లో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మే18నే కేబినెట్​ అంతర్గతంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

Covaxin
కొవాగ్జిన్
author img

By

Published : May 21, 2021, 5:08 PM IST

Updated : May 21, 2021, 5:46 PM IST

కరోనా టీకాల ఉత్పత్తి సామార్థ్యాన్ని పెంచేందుకు సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి మే18నే అంతర్గతంగా కేబినేట్​ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.

కేబినేట్​ చర్చించిన అంశాలు

  • బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ)తో చర్చించి కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తిని విదేశాల్లో చేపట్టాలి
  • ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లడం
  • భారత్​లో మెడెర్నా, జాన్సన్​ అండ్ జాన్సన్​ టీకాలను ఇతర కంపెనీలు తయారు చేసేందుకు సాంకేతిక బదిలిలో సమస్యల ప్రస్థావన
  • కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాకు ఇండియాలో మరిన్ని లైసెన్సులు
  • ఇందుకోసం అస్ట్రాజెనెకాను సంప్రదించాలని విదేశాంగశాఖకు ఆదేశం
  • ఫైజర్​ టీకా విషయంపై అంతర్గత వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సహించే విభాగం, నీతి ఆయోగ్​, విదేశాంగ శాఖ, న్యాయ శాఖ కార్యదర్శితో సంప్రదించాలి

మరికొంత సమాచారం

కొవిషీల్డ్ కోసం ముడి పదార్థాల సరఫరా అడ్డంకులను పరిష్కరించడానికి విదేశాంగ శాఖ, బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాయి

(బయోసేప్టీ లెవల్స్​-3) బీఎస్​ఎల్-3 సదుపాయం ఉన్న తయారీదారులతో పాటు భారతదేశంలో ఉత్పాదక స్థలాలను పెంచడానికి, అలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయగల వారిని గుర్తించాలని డీబీటీ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను ప్రభుత్వం కోరింది.

ఇదీ చదవండి: అదనంగా 20కోట్ల కొవాగ్జిన్​ టీకాల ఉత్పత్తి

Last Updated : May 21, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.