ETV Bharat / bharat

'కరోనాపై అతి విశ్వాసంతో కేంద్రం'

కరోనాపై పోరు విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కొవిడ్​-19 పట్ల కేంద్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Feb 17, 2021, 1:27 PM IST

కేంద్రంపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా మరోసారి విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం అతి విశ్వాసం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత ఆరోపించారు. వైరస్​ ఇంకా పూర్తిగా అంతం కాకముందే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

దేశంలో ఇటీవల దక్షిణాఫ్రికా, బ్రెజిలియన్​ రకం వైరస్​లు బయటపడిన తర్వాత ట్విట్టర్​ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​.

Rahul Gandhi Tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​

దేశంలో తొలిసారిగా దక్షిణాఫ్రికా రకం వైరస్​ వేరియంట్​ బారినపడిన వారిని నలుగురిని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరో వ్యక్తికి బ్రెజిల్​ రకం వైరస్​ సోకినట్టు పేర్కొంది. బాధితులలో ఒకరు అంగోలా, మరొకరు టాంజానియా నుంచి రాగా.. మరో ఇద్దరు వ్యక్తులు దక్షిణాఫ్రికా నుంచి జనవరిలో వచ్చారని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) డైరక్టర్​ జనరల్​ బలరామ్​ భార్గవ వెల్లడించారు.

ఇదీ చదవండి: కశ్మీర్​లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న గుడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.