ETV Bharat / bharat

సీబీఐ కస్టడీలో బంగారం మాయం- పోలీసుల దర్యాప్తు! - సీబీఐ కోర్టు దర్యాప్తు

అక్రమార్కులకు వణుకు పుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం అదృశ్యమైందన్న ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనపై నిజానిజాలు తేల్చే బాధ్యత తమిళనాడు పోలీసులకు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది. సీబీఐకి ఇదొక పరీక్షగా పేర్కొన్న కోర్టు.. దోషిగా తేలితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

gold-worth-rs-45-cr-goes-missing-from-cbi-custody-madras-high-court-orders-probe
సీబీఐ కస్టడీలో బంగారం మాయం
author img

By

Published : Dec 12, 2020, 4:58 PM IST

తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం అదృశ్యమైందన్న విషయం తీవ్ర కలకలం సృష్టించింది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ విషయంపై విచారణ జరపాలంటూ మద్రాసు హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అయితే స్థానిక పోలీసులతో దర్యాప్తు జరిపితే సంస్థ ప్రతిష్ఠ దిగజారుతుందన్న సీబీఐ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇది సీబీఐకి అగ్నిపరీక్షగా అభివర్ణించింది మద్రాస్‌ హైకోర్టు. వారు సీతాదేవీ అంత పవిత్రంగా ఉంటే వారి చేతులకు ఎలాంటి అవినీతి మరకలు లేకుండా కేసు నుంచి క్షేమంగా బయటపడతారని పేర్కొంది. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఇదీ నేపథ్యం

2012లో చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్‌పై నమోదైన ఓ కేసులో సీబీఐ ఆ కంపెనీ నుంచి 400.47 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. కాగా.. 2013లో సురాణా కంపెనీపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ.. తొలి కేసులో బంగారం స్వాధీనం అవసరం లేదని, దాన్ని రెండో కేసుకు బదలాయించాలని కోర్టును కోరింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. అయితే 2015లో సురాణా కంపెనీపై ఉన్న రెండో కేసును సరైన సాక్ష్యాలు లేని కారణంగా మూసివేస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించింది. ఇందుకు అంగీకరించిన కోర్టు స్వాధీనంలో ఉన్న బంగారాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌కు అప్పగించాలని ఆదేశించింది.

అప్పటికే సురాణా కంపెనీ ఎస్​బీఐ వద్ద రుణం తీసుకొని ఎగవేయటంతో బ్యాంకు చర్యలను ప్రారంభించింది. సీబీఐ స్వాధీనంలో ఉన్న బంగారాన్ని తమకు అప్పగించాలని కోరుతూ బ్యాంక్‌ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై 2019 డిసెంబరులో విచారణ జరిపిన ట్రైబ్యూనల్‌.. సీబీఐ కస్టడీలో ఉన్న బంగారం మొత్తాన్ని బ్యాంకులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంక్‌ ప్రతినిధుల సమక్షంలో బంగారాన్ని తూకం వేయగా.. 103 కేజీలు తక్కువగా ఉన్నట్లు తేలింది. పసిడి మెుత్తాన్ని సీల్‌ చేశామని... అదృశ్యమైన బంగారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.