రాజస్థాన్లోని జైపుర్ విమానాశ్రయంలో నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఐరన్ బాక్స్ రూపంలో ఉన్న ఈ బంగారం విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ లగేజీ తెచ్చిన ప్రయాణికుడి కోసం గాలిస్తున్నామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటఎలిజెన్స్ అధికారులు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం.. షార్జా నుంచి భారత్కు బంగారాన్ని అక్రమ రవాణా చేయనున్నట్లు సమాచారం అందడం వల్ల ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా భావించిన లగేజీలను తనిఖీ చేయగా ఒకదాంట్లో ఈ గోల్డెన్ ఐరన్ బాక్స్ దొరికింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన అధికారులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అంతకుముందు మరో ఘటనలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.55 లక్షలు విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి : అంతరిక్షంలో అద్భుతం.. 1000 ఏళ్ల తర్వాత ఒకే వరుసలోకి 4 గ్రహాలు