ETV Bharat / bharat

'ఒక సిటీ స్కాన్..​ 400 ఎక్స్‌రేలతో సమానం' - రణదీప్​ గులేరియా తాజా వార్తలు

కరోనా భయంతో అసలు లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు కూడా సీటీ స్కాన్​ చేయించుకుంటున్న నేపథ్యంలో ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా కీలక సూచనలు చేశారు. ఒక సిటీస్కాన్‌ 300 నుంచి 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానం అని పేర్కొన్నారు. దీనివల్ల క్యాన్సర్​ బారిన పడే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

ranadeep guleria
'ఒక సిటీ స్కాన్​ వందలాది ఎక్స్‌రేలతో సమానం'
author img

By

Published : May 3, 2021, 10:25 PM IST

ప్రస్తుతం కరోనా బారిన పడివారు, యాంటీజెన్‌, ఆర్​టీ-పీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా వచ్చిన వారు భయంతో సిటీస్కాన్‌ చేయించుకుంటున్నారు. సిటీస్కాన్‌ వల్ల మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువని ఎయిమ్స్‌ చీఫ్‌ డా.రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడేవారికి సిటీస్కాన్‌ అక్కర్లేదని స్పష్టం చేశారు. కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చిన వారు సిటీస్కాన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

"ఒక సిటీస్కాన్‌ 300 నుంచి 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానం. తరచూ సిటీస్కాన్‌ చేయడం వల్ల యువత క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ శరీరం రేడియేషన్‌కు గురికావడం వల్ల అంతర్గతంగా దెబ్బతింటుంది. దయచేసి స్వల్ప కొవిడ్‌ లక్షణాలు ఉండి, సాధారణ ఆక్సిజన్‌ స్థాయిలు ఉన్నవారు సిటీస్కాన్‌ చేయించుకోవద్దు"

-రణదీప్​ గులేరియా, ఎయిమ్స్‌ డైరెక్టర్​

కేవలం ఆస్పత్రిలో చికిత్స పొందేవారు మాత్రమే, అది కూడా వైద్యుల సూచనల మేరకే సిటీ స్కాన్‌ చేయించుకోవాలన్నారు రణదీప్​ గులేరియా. అయితే.. అంతకుముందు చెస్ట్‌ ఎక్స్‌రేకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. స్వల్ప లక్షణాలతో పాటు, అసలు లక్షణాలు లేని వారు కూడా సిటీస్కాన్‌ చేయించుకుంటున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో గులేరియా ఈ హెచ్చరిక చేశారు.

స్టెరాయిడ్స్ తీసుకోవద్దు..

అదే విధంగా కరోనా వైరస్‌ సోకగానే స్టెరాయిడ్స్ తీసుకోవద్దని కూడా డా.రణదీప్‌ గులేరియా సూచించారు. వైరస్‌ ప్రారంభ దశలోనే స్టెరాయిడ్లను తీసుకోవడం వల్ల వైరల్‌ రిప్లికేషన్‌ జరిగే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన వైరల్‌ న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు వైరస్‌ ప్రారంభ దశలో స్టెరాయిడ్స్‌ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా, టోసిలిజుమాబ్‌ వంటి ఔషధాలు అత్యవసర వినియోగానికి మాత్రమేనని స్పష్టం చేశారు. వాటిని సరైన సమయంలో వాడటం ముఖ్యమని తెలిపారు.

హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయి 93 లేదా అంతకంటే తగ్గినా, ఛాతీ నొప్పి, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తప్పని సరిగా వ్యాక్సిన్‌ ప్రైమింగ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్‌ రెండూ తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ఇదీ చూడండి: కొవిడ్​ మృతదేహాలను పీక్కు తిన్న శునకాలు!

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.