ETV Bharat / bharat

Goa Trip Travel Guide for First Time Visitors : గోవా టూర్​ సరే.. అక్కడికెళ్లి ఏం చూస్తారు..? మీ కోసం కంప్లీట్ ట్రావెల్ గైడ్..

Goa Trip Travel Guide for Visitors : ఇండియాలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనగానే.. గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్​.. "గోవా". ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో టైం స్పెండ్​ చేయడంతోపాటు.. డెస్టినేషన్​ వెడ్డింగ్స్​ వరకూ గోవా ఫుల్ ఫేమస్​. అయితే.,. చాలా మంది గోవాకు వెళ్తారు కానీ.. అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి మాత్రం పెద్దగా తెలియదు. ఇలాంటి వారికోసమే ఈ కంప్లీట్ గోవా టూర్ గైడ్ స్టోరీ.

Goa Tour Travel Guide for Visitors
Goa Trip Travel Guide for First Time Visitors
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 4:53 PM IST

Complete Travel Guide to Goa for First Time Visitors: దేశ, విదేశీ పర్యాటకుల తాకిడితో ఎప్పుడూ కోలాహలంగా ఉండే నగరం 'గోవా'. ఇక్కడి బీచ్ ల గురించి, టూరిస్ట్ ప్రదేశాల గురించి చెప్పుకోని వారు ఉండరు. అయితే మొదటిసారి గోవా వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రదేశాల గురించి అవగాహన లేకుండా.. కొన్ని కొన్ని ప్రదేశాలు మాత్రమే చూసి తృప్తి పడతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఎటువంటి గైడ్​ సాయం లేకుండా.. గోవాను పూర్తిగా చూసి ఎంజాయ్​ చేయోచ్చు. మరి అవి ఏంటో తెలుసుకుందామా..?

Goa Travel Guide: గోవా ట్రావెల్ గైడ్:
1. Best Places to Visit in Goa Telugu: గోవాలో చూడదగిన ప్రదేశాలు:

  • టిటో వీధి (Titos Street): రాత్రి సమయంలో గోవా అందాలను చూడకపోతే టూర్​లో ఎంజాయ్​మెంట్​ అనేది ఉండదు. అలాంటి ఎంజాయ్​మెంట్​కు పెట్టింది పేరు.. టిటో వీధి. బాఘా బీచ్ సమీపంలో ఉన్న ఈ వీధి.. నైట్ క్లబ్​లకు ఫేమస్​.​ ప్రపంచం నలుమూలల నుంచి ఈ నైట్​ క్లబ్​ జనాలను ఆకర్షిస్తుంది. మీరు పార్టీ ప్రేమికులు, ఆహార ప్రియులు అయితే తప్పనిసరిగా ఈ టిటోస్​ స్ట్రీట్​ను చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మెయిన్​గా ఉండేది డ్యాన్స్​ అండ్​ ఫుడ్.​
  • దూద్‌ సాగర్ జలపాతాలు(Dudhsagar Waterfalls): మాండోవి నదిపై ఉన్న దూద్‌సాగర్ జలపాతం భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. గోవా-కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ నాలుగు అంచెల జలపాత నిర్మాణం తప్పక చూడవలసిన ప్రదేశం. పచ్చని అడవి, తెల్లని నీటితో కూడిన ఈ ప్రకృతి సౌందర్యం.. పర్యాటకులను కట్టిపడేస్తాయి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి దూద్​సాగర్​ జలపాతాలను చూడాల్సిందే.
  • పోర్ట్స్​(Forts): గోవాలో అనేక కోటలను నిర్మించిన ముస్లిం చక్రవర్తి ఆదిల్ షా కూడా ఈ రాష్ట్రాన్ని పాలించాడు. కొన్ని కోటలు రీమోడలింగ్​ చేస్తే.. మరికొన్ని అలాగే ఉన్నాయి. ఈ కోటలు గోవా ఆచారం, నిర్మాణ ప్రాముఖ్యతను చాటుతాయి. ఈ కోటలు రాష్ట్రం అంతటా, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఉత్తర గోవాలో ప్రసిద్ధ కోటలు.. చప్రా ఫోర్ట్, అగ్వాడా ఫోర్ట్, టిరాకోల్ ఫోర్ట్, దక్షిణ గోవాలోని అత్యంత ప్రసిద్ధ కోట కాబో డి రామ కోట. ఈ కోటలన్నీ.. గత పురాణ కథలను తెలుపుతాయి.

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

2. Things to Do in Goa: గోవాలో చేయవలసిన పనులు:

  • వాటర్ స్పోర్ట్స్(Water Sports): థ్రిల్ కోసం వెతుకుతున్న వారికి గోవా కరెక్ట్​ ప్లేస్​. సాహస ప్రియులు, ఔత్సాహికులు సాహసాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నీటి అడుగున డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్, జెట్ స్కీయింగ్, పారాసైలింగ్ వంటి అనేక వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. వీటిలో పాల్గొని ఎంజాయ్​ చేయవచ్చు.
  • గోవా క్యాసినో(Goas Casinos): గోవాలో క్యాసినో గురించి చాలా మందికి తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా నైట్​ టైం క్యాసినో వేరే లెవల్​లో ఉంటుంది. ఈ క్యాసిన్​లో అపరిమిత ఆహారం, కూల్​డ్రింక్స్​తో పాటు స్లాట్‌లు, పోకర్, ఫ్లష్ బాకరట్ మొదలైన గేమ్‌లు ఉంటాయి. గోవాలోని ఉత్తమ క్యాసినోలు పంజిమ్‌లో ఉన్నాయి.
  • ఇ-బైక్ టూర్(E-Bike Tour): గోవా వెళ్లినప్పుడు.. కారు పర్యటనలకు దూరంగా ఉండి, అక్కడి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అందాలను అన్వేషించాలనుకుంటున్నారా? అయితే దానిని E-బైక్ టూర్​తో ప్రయత్నించండి. ఈ బ్యాటరీతో పనిచేసే బైక్‌లపై ప్రయాణించడం ఒక రకమైన అనుభవం. గోవాలోని ప్రదేశాలను చూసేందుకు, టేస్టీ ఫుడ్​ను రుచి చూడటానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి ఈ బైక్​లపై వెళితే మస్త్​ ఖుష్​ అవుతారు.

3. Best Beaches in Goa: గోవాలోని ఉత్తమ బీచ్‌లు: అందమైన, హిప్నోటిక్ బీచ్‌లను చూడటానికి గోవా కంటే మంచి ప్రదేశం ఇంకోటి లేదు. పార్టీలకు బీచ్​లు బెస్ట్​ స్పాట్​. మరి గోవాలోని కొన్ని ఉత్తమ బీచ్‌లు మీ కోసం..

  • బాగా బీచ్(Baga Beach): గోవాలో ఫేమస్​ బీచ్ 'బాగా'. పార్టీ సమూహాలు, సంగీతం, వాటర్ స్పోర్ట్స్, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, బార్‌లు, క్లబ్‌లతో నిండిన గోవాలోని సముద్ర తీరాలలో ఇది ఒకటి. డాల్ఫిన్ క్రూయిజ్‌లు, పారాసైలింగ్, వేక్‌బోర్డింగ్, విండ్‌సర్ఫింగ్, కైట్ సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఈ ఫోర్‌షోర్‌లోని ప్రధాన ఆకర్షణలు.
  • కండోలిమ్ బీచ్(Candolim Beach): గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కండోలిమ్ సమీప బీచ్​కు గంట ప్రయాణం. బీచ్.. షాక్స్, కేఫ్‌లతో కప్పబడిన క్లాసిక్ ఇసుకతో ఇది గోవాలోని పొడవైన వాటిలో ఒకటి. ఇది సాపేక్షంగా తక్కువ రద్దీగా ఉంటుంది.
  • అగోండా బీచ్(Agonda Beach): గోవాలోని అగోండా బీచ్.. హనీమూన్​కు బెస్ట్​ ప్లేస్​. ఈ ప్రశాంత, ఆహ్లాదకరమైన ప్రదేశం లైఫ్​ పార్టనర్​, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడానికి సరైనది.
  • పలోలెం బీచ్(Palolem Beach): కొబ్బరి చెట్లతో దట్టమైన అడవిలా ఉండే ఈ పలోలెం బీచ్​.. రాష్ట్రంలోని మరొక ఆఫ్-బీట్ ఆకర్షణ. ఇది పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

4. Best Places to Eat in Goa: గోవాలో తినడానికి బెస్ట్​ ప్లేసెస్​: గోవాలో బెస్ట్​ ఫుడ్​ అంటే సీఫుడ్. తీరప్రాంత వంటకాలు, స్థానిక రుచులు మరింత ఆకలిని పుట్టించేలా చేస్తాయి. గోవాలో వంటకాల రుచిని రుచి చూసేందుకు అనేక రెస్టారెంట్లు, కేఫ్‌లు ఉన్నాయి.

రాష్ట్రంలో తినడానికి కొన్ని ఉత్తమమైన ప్రదేశాలు:

  • The Fisherman’s Wharf
  • Thalassa(తలస్సా)
  • Luna’s Ristorante(లూనాస్ రిస్టోరంటే)
  • Spice Goa(స్పైసీ గోవా)
  • Zeebop by the Sea

5. Where to Shop in Goa: గోవాలో షాపింగ్​ మాల్స్​: గోవా వెళ్లినప్పుడు షాపింగ్​ చేయాలనుకున్నవారికి మాల్స్​ కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని..

  • అంజునా ఫ్లీ మార్కెట్ (Anjuna Flea Market)
  • అర్పోరా నైట్ మార్కెట్ Arpora’s Night Market
  • మపుసా ఫ్రైడే మార్కెట్ Mapusa Friday Market
  • బాగా మార్కెట్ Baga Market
  • పంజిమ్ మున్సిపల్ మార్కెట్ Panjim Municipal Market
  • మాకీస్ నైట్ బజార్ Mackie’s Night Bazaar

6. గోవా సందర్శించడానికి ఉత్తమ సమయం:

Best Time to Visit Goa: గోవాను చూడటానికి అక్టోబర్-ఏప్రిల్, మే-సెప్టెంబర్ మధ్యలో రెండు సార్లు వెళ్లొచ్చు. అక్టోబరు- ఏప్రిల్ మధ్య బీచ్‌లలో విశ్రాంతి తీసుకోవడానికి, వాటర్ స్పోర్ట్స్ ఆడటానికి, గోవాలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ సన్‌బర్న్, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను చూసేందుకు మంచి టైం. మే నుంచి సెప్టెంబరు వరకు బీచ్‌లు దాదాపు ఖాళీగా ఉంటాయి. హోటల్‌లో స్టే చేసే వారికి ధరలు అందుబాటులో ఉంటాయి.

7. గోవా చేరుకోవడం ఎలా:

How to Reach Goa: భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానం, ట్రైన్స్​, రోడ్డు ద్వారా గోవా చేరుకోవచ్చు. గోవా నగరానికి సమీర విమానాశ్రయం దబోలిమ్​ ఎయిర్​పోర్ట్​ , సమీప రైల్వే స్టేషన్ వాస్కోడగామా, మడ్గావ్ ఉన్నాయి.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.