ETV Bharat / bharat

కడుపులో చాయ్​ గ్లాస్​.. ఎలా మింగేశాడంటే..?

Glass in Stomach: చిన్న పిల్లలు పిన్నులు, నాణేలు మింగిన సందర్భాలు చూశాం. కానీ ఓ వ్యక్తి కడుపులో ఏకంగా చాయ్​ గ్లాస్​ బయటపడితే ఆశ్చర్యమే కదా. ఈ ఘటన బిహార్​లోని ముజఫర్​పుర్​ జిల్లాలో జరిగింది.

glass in stomach
డుపులో చాయ్​ గ్లాస్
author img

By

Published : Feb 21, 2022, 11:37 AM IST

Glass in Stomach: బిహార్​లోని ముజఫర్​పుర్​ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. అతని కడుపులో గ్లాసు ఉందని గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి తొలగించారు.

glass in stomach
ఎక్స్​-రేలో కడుపులో కనిపిస్తున్న గ్లాస్​

తీవ్ర కడుపు నొప్పితో జిల్లాలోని మడిపుర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు ఓ 55ఏళ్ల వ్యక్తి. వెంటనే డాక్టర్లు అతనికి ఎక్స్​-రే తీశారు. బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్లుగా అందులో గుర్తించారు. గ్లాస్​ను తీయడానికి మొదట ఎండోస్కోపిక్ ద్వారా ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో చివరగా ఆపరేషన్​​ చేయాల్సి వచ్చింది. బాధితున్ని అడగ్గా.. చాయ్​ తాగేప్పుడు గ్లాస్ మింగేశానని చెప్పాడు. కానీ సన్నగా ఉండే ఆహార నాళంలో గ్లాసు పట్టే అవకాశం లేదని వైద్యులు అంటున్నారు.

glass in stomach
వ్యక్తి కడుపులో చాయ్​ గ్లాస్​

అతడి ఆరోగ్యం ఇప్పడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఒక్కగానొక్క కొడుకు.. నాలుగో అంతస్తు నుంచి పడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.