ETV Bharat / bharat

భర్తను వదిలి 22 రోజులు సహజీవనం.. ఆపై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య - బెదిరింపులు తాళలేక

తన భర్తను వదిలి మరో యువకుడితో 22 రోజుల పాటు సహజీవనం చేసింది ఓ మహిళ. ఆ తర్వాత మళ్లీ తన భర్త దగ్గరకు చేరింది. ఆ తర్వాత యువకుడిని రూ.5 లక్షలు ఇవ్వకపోతే జైలులో పెట్టిస్తా అంటూ తీవ్రంగా వేధించారు ఆమె కుటుంబసభ్యులు. ఆ బెదిరింపులు తాళలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అసలేం జరిగిందంటే?

Youngman Suicide:
Youngman Suicide:
author img

By

Published : Jun 3, 2022, 9:26 AM IST

Youngman Suicide: మధ్యప్రదేశ్​లో ఇందోర్​లోని బంగంగా ప్రాంతంలో ఓ యువకుడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ జరపగా షాకింగ్​ నిజాలు బయటపడ్డాయి. దీంతో ఇద్దరు అనుమానితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

పోలీసుల వివరాల ప్రకారం.. సుఖ్లియా ప్రాంతంలో సాగర్​ కుష్వాహ అనే యువకుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్తను వదిలి సాగర్​ దగ్గరకు వచ్చింది. అతడితో కలిసి 22 రోజులపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత తన భర్త దగ్గరకు తిరిగి వెళ్లిపోయింది. అయితే ఇదే విషయాన్ని అదనుగా తీసుకున్న ఆమె భర్త బబ్లూ.. సాగర్​ను వేధించడం ప్రారంభించాడు. ఐదు లక్షలు రూపాయలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. బబ్లూ మరదలు కిరణ్​ నిహారే కూడా సాగర్​ను మానసికంగా వేధించింది. దీంతో వాటిని భరించలేక అతడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్​ కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని బబ్లూతోపాటు అతడి మరదలుపై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి: సింగర్ హత్యతో దిగొచ్చిన పంజాబ్​ సర్కార్.. వారికి భద్రత పునరుద్ధరణ!

పోలీసుల లైంగిక వేధింపులు.. ఉరేసుకొని చనిపోయిన యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.