ETV Bharat / bharat

వివాహాల్లో లెహంగాలు నిషేధం.. పెళ్లి బరాత్​లు బంద్! ఆహారం ఇంటికి తీసుకెళ్తే రూ.30వేల ఫైన్ - Ban on Barat at midnight in village

గ్రామ ప్రజలు అనవసర ఖర్చులు చేయకుండా పంచాయతీ కమిటీ ఓ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. పెళ్లి కార్యక్రమాలపై పలు ఆంక్షలు విధించింది. వివాహాలలో వేసుకునే దుస్తులపైనా నిబంధనలు పెట్టింది. అవేంటంటే?

girls-will-not-wear-lehengas-in-weddings-decision-of-village-panchayat-in-panjab
పెళ్లి లెహంగా వేసుకోవడంపై నిషేదం విధించిన గ్రామ పంచాయతి
author img

By

Published : Feb 4, 2023, 10:03 AM IST

పంజాబ్​లోని ఓ గ్రామ పంచాయతీ కమిటీ వినూత్న నిర్ణయాలు తీసుకుంది. గ్రామ ప్రజలు అనవసర ఖర్చులు చేయకుండా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. యువతులెవ్వరు వివాహాల్లో లెహంగా ధరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటాక పెళ్లి బరాత్​ నిర్వహించవద్దని తెలిపింది. గ్రామంలో గుట్కాలు అమ్మకుండా, కొనకుండా నిషేదం విధించింది. కపుర్తలా జిల్లాలోని భదాస్ గ్రామ పంచాయతీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు పంచాయతీ పెద్దలు. రాత్రి 12 గంటలలోపే బరాత్​ సహా మిగతా అన్ని కార్యక్రమాలు ముగించాలని తెలిపారు. పెళ్లిలో యువతులు లెహంగా కాకుండా కేవలం చుడిదార్​నే ధరించాలని స్పష్టం చేశారు. వివాహం తరువాతి రోజు పెళ్లి కొడుకు కుటుంబం మాత్రమే అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లాలన్నారు. నిబంధనలను ఉల్లఘింస్తే 11వేల రూపాయల జరిమానా కట్టాలని తేల్చి చెప్పారు. గురుద్వారాల పవిత్రత, గౌరవాన్ని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ పెద్దలు వివరించారు.

girls-will-not-wear-lehengas-in-weddings-decision-of-village-panchayat-in-panjab
గ్రామ పంచాయతి కమిటీ సమావేశం

గ్రామంలో ఏర్పాటు చేసే లంగర్​ నుంచి.. ఆహారాన్ని టిఫిన్ బాక్స్​ల్లో, కవర్లలో ఇంటికి తీసుకువెళ్లొద్దని మరిన్ని ఆదేశాలు జారీచేశారు గ్రామ పెద్దలు. అలా చేసిన వారికి రూ.10 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. దోషిగా తేలినవారు గురు​ద్వారాలో రెండు నెలల పాటు సేవ చేయాలని తీర్మానించారు. గ్రామ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు ఎవరైనా ఈ ఇలాంటి పనులు చేస్తే రూ.30వేల జరిమానాతో పాటు మూడు నెలల పాటు గురుద్వారాలో సేవ చేసేలా నిబంధన తీసుకొచ్చారు. గ్రామంలో డ్రగ్స్​, జర్దా, పొగాకు, కైనీ వంటివి అమ్మినట్లయితే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.