Bihar dgp about love marriages: బిహార్ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ఎస్కే సింఘాల్ గురువారం షాకింగ్ విషయాలు చెప్పారు. ప్రేమ పెళ్లికోసం ఇంటిని వీడి వెళ్తున్న అమ్మాయిలు.. బలవంతంగా వ్యభిచార ముఠాలోకి వెళ్తున్నారని అన్నారు. సమస్తీపుర్‌లో నిర్వహించిన 'సమాజ్ సుధార్ అభియాన్' వేదికగా గురువారం ఆయన మాట్లాడారు.
"తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి కోసం ఇంటిని వీడి వెళ్తున్న సంఘటనలను మనం చూస్తున్నాం. అయితే... వారిలో చాలా మంది హత్యకు గురువుతున్నారు. మరికొంతమంది బలవంతంగా వ్యభిచారంలోకి చేరుతున్నారు. వీటికి తల్లిదండ్రులే మూల్యం చెల్లించుకుంటున్నారు."
-ఎస్కే సింఘాల్, బిహార్ డీజీపీ.
తల్లిదండ్రులు తమ పిల్లలో తరుచూ మాట్లాడాలని సింఘాల్ కోరారు. వారికి మంచి విలువలు బోధించాలని.. వారి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవాలని సూచించారు.
అల్కాహాల్ డీఅడిక్షన్, వరకట్న నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం వంటి సామాజిక సంస్కరణల కోసం... 'సమాజ్ సుధార్ అభియాన్' పేరుతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య
ఇదీ చూడండి: 'ఆత్మలతో మాట్లాడటం' కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయిన మైనర్!