ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం - ఆరేళ్ల బాలికపై అత్యాచారం

ఉత్తర్​ ప్రదేశ్​లో ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగింది. నోయిడాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 23 ఏళ్ల యువకుడు. మరో ఘటనలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు ఓ కిరాతకుడు.

noida rape
రేప్, అత్యాచారం
author img

By

Published : Jun 2, 2021, 9:46 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఆరేళ్ల బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో.. గ్రేటర్ నోయిడాలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు ఓ కిరాతకుడు. ఈ రెండు ఘటనలకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

నోయిడాలో జరిగిన రేప్​ ఘటనపై మే 30న కేసు నమోదైనట్లు డీసీపీ వృందా శుక్లా పేర్కొన్నారు. నిందితుడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు స్పష్టం చేశారు.

మరో ఘటనలో.. గౌతమ్​ బుద్ధ్ నగర్​కు పనికోసం వచ్చిన ఓ వ్యక్తి.. పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని డీసీపీ శుక్లా తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సోమవారం చిన్నారిపై.. నిందితుడు లైంగిక దాడి చేసినట్లు పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:నడుస్తున్న రైలులో యువతి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.