ETV Bharat / bharat

విద్యార్థినిపై హత్యాచారం.. దళిత మహిళపై యాసిడ్ దాడి.. డీజే సౌండ్ వద్దన్నందుకు.. - దళిత మహిళపై యాసిడ్ దాడి

19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, డీజే సౌండ్​తో తగ్గించాలని చెప్పిన ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు దుండగులు. హరియాణాలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరోవైపు, దుకాణానికి వెళ్లిన బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన యూపీలోని మహోబాలో వెలుగుచూసింది.

rape
అత్యాచారం
author img

By

Published : Oct 6, 2022, 6:27 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మెయిన్​పురిలో దారుణం జరిగింది. 19 ఏళ్ల విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన భోగావ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆ తర్వాత విద్యార్థిని మృతదేహానికి ఉరివేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని రప్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు(19) బీఎస్సీ రెండో సంవత్సరం చదివేది. తన సోదరితో కలిసి భోగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేది. బాధితురాలి తల్లిదండ్రులు పని నిమిత్తం ఆగ్రాలో ఉంటున్నారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన పుష్పేంద్ర(25).. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం వల్ల.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. కాసేపటి తర్వాత బాధితురాలి చెల్లి... గ్రామస్థులకు జరిగిన దారుణాన్ని తెలిపింది. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం తరలించారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

మహిళపై యాసిడ్ దాడి..
ఉత్తర్​ప్రదేశ్ సంభల్​లో దళిత మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఎన్నికల్లో వివాదాల కారణంగా తన తల్లిపై యాసిడ్ దాడి జరిగినట్లు ఆమె కుమారుడు తెలిపాడు. పొలంలోకి ఈడ్చుకెళ్లి తన తల్లిపై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

రైల్వే ఉద్యోగిపై..
హరియాణా పానీపత్​​లోని సనౌలీ రోడ్డులో దారుణం జరిగింది. డీజే శబ్దాలతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న ముగ్గురు వ్యక్తులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో మన్​ప్రీత్​ అనే రైల్వే ఉద్యోగి మరణించగా, అతని సహచరులు ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మన్​ప్రీత్​ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

బాలికను కిడ్నాప్ చేసి..
ఉత్తర్​ప్రదేశ్ మహోబాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. దుకాణానికి వెళ్లిన ఓ బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాల్ని నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయారు. బుధవారం రాత్రి జరిగిందీ ఘటన. దుకాణానికి వెళ్లిన కుమార్తె ఎప్పటికి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతికారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో బాధితురాలు కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి రాగానే తనపై జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.

అత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా..
ఉత్తర్​ప్రదేశ్ అంబేడ్కర్ నగర్​లో దారుణం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని బాధితురాలు ఆవేదన చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారించేందుకు ఓ కమిటీని వేశారు జిల్లా మెజిస్ట్రేట్​ శామ్యూల్ పాల్​. అంబేడ్కర్ ​నగర్ జిల్లా మెజిస్ట్రేట్​ శామ్యూల్​ పాల్​.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని అన్నారు.

ఇవీ చదవండి: యాక్సిడెంట్​లో 33మంది మృతి.. ఆ పాప మాత్రం సేఫ్.. చనిపోయిన తల్లి గుండెను 12గంటలు హత్తుకుని..

సోనియా, రాహుల్​ పాదయాత్ర.. అమ్మ షూ లేస్​ కట్టిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.